రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమయ్యింది. ప్రధాని మోడీతో మొదలుకుని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మినిస్టర్లు దీనికి భారీ ఎత్తున హాజరు కాబోతున్నారు. మాములుగా ఇలాంటి కార్యక్రమంలో సినీ తారల సందడి తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి దక్కిన చారిత్రాత్మక విజయానికి సాక్ష్యంగా నిలవడం కోసం పెద్ద ఎత్తున స్టార్లు తరలివస్తున్నారు. ఆహ్వానాలు ఎవరికి వెళ్లాయనే పూర్తి సమాచారం ఇంకా రాకపోయినా ముఖ్యమైన లిస్టు అయితే కొంతవరకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటు సురేఖా, శ్రీజ, ఇద్దరు మనవరాళ్లు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. బాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. చంద్రబాబుకి అత్యంత ఆప్త మిత్రుల్లో ఒకరైన ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వెళ్లిందని తొలుత ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి అందలేదని తారక్ టీమ్ అంటున్న మాట. అల్లు అర్జున్ రావొచ్చని మరో వార్త ఉంది. మహేష్ బాబు, ప్రభాస్ లకు పిలుపు వెళ్లిందన్నారు కానీ ఖరారుగా తెలియదు.
మొత్తానికి అరుదైన తారా తోరణానికి రేపటి సంరంభం వేదిక కానుంది. అసలే టాలీవుడ్ లో కూటమి వచ్చిన ఆనందం కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటిదాకా ఎదురైన ఇబ్బందికర పరిస్థితులకు చరమగీతం పాడేశారని సంతోషంగా ఉన్నారు. దీంతో ఫోన్ కాల్స్ ఇతరత్రా మార్గాల ద్వారా ఇన్విటేషన్ అందుకున్న ఇండస్ట్రీ పెద్దలు రేపు భారీ ఎత్తున తరలివచ్చిన ఆశ్చర్యం లేదు. ఎన్నో నెలల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై కలుసుకోవడం లాంటి అరుదైన జ్ఞాపకాలు రేపు చూడబోతున్నాం. పవన్ డిప్యూటీ సిఎంగా పదవి స్వీకరిస్తారనే న్యూస్ ఆల్రెడీ తిరుగుతోంది. రేపు మాములు సందడి ఉండేలా లేదు.
This post was last modified on June 11, 2024 9:56 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…