నిన్న సాయంత్రం భారీ ఆశలు అంచనాల మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి ట్రైలర్ ఊహించినట్టే వ్యూస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. దర్శకుడు నాగ అశ్విన్ ఊహా ప్రపంచాన్ని చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. షూటింగ్ జరిగినంత కాలం ఎలాంటి లీక్ బయటికి రాకుండా జాగ్రత్త పడిన టీమ్ ఒక్కసారిగా మూడు నిమిషాల వీడియోతో ఆశ్చర్యానికి గురి చేసింది. మహానటి తర్వాత ఏళ్ళ తరబడి గ్యాప్ తీసుకున్న నాగఅశ్విన్ నిజంగా తపస్సే చేశాడనే రేంజ్ లో కట్టిపడేసాడు. అయితే ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఇందులో ఒకటుంది. అదే కమల్ హాసన్ గెటప్.
ఆయన్ని రెండు మూడు షాట్లలోనే చూపించినా వయసు మళ్ళిన గెటప్ లో ఇండియన్ 2నే గుర్తు చేశాడనే కామెంట్ ని కాదనలేం. ఎందుకంటే వయసు, మేకప్ పరంగా చూస్తే ప్రస్తుతానికి పోలికలు దగ్గరగా ఉన్నాయి. తన కథకు సూటయ్యేలా ఎలాగూ సేనాపతి ఉన్నాడు కానీ చిన్నపాటి మార్పులు చేసుకుని నాగఅశ్విన్ లోకనాయకుడిని వాడుకున్నాడా అనే సందేహం కలుగుతోంది. ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేం కానీ కల్కిలో ఆయన పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందనే లీక్ కొన్ని వారాల క్రితమే లీకైపోయింది. రెండో భాగంలో ఎక్కువసేపు ఉంటాడని యూనిట్ టాక్.
రిలీజ్ అయ్యేంత వరకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. స్టోరీ గురించి ఎక్కువ డీటెయిల్స్ లేకుండా ట్రైలర్ కట్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్న వైనం కూడా కనిపించింది. దీపికా పదుకునే గర్భంతో ఉండటం, అమితాబ్ ఆ బిడ్డను కాపాడే బాధ్యతను తీసుకోవడం, బుజ్జి వాహనాన్ని తీసుకుని భైరవ వస్తే మరి కల్కి ఎవరనే డౌట్ రావడం ఇలా చెప్పుకుంటూ పోతే సుడోకు పజిల్ లాగా మారిపోతుంది. జూన్ 27 థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమని, టికెట్ల కోసం ఫోన్లు రావడం నెలల తర్వాత థియేటర్ యజమానులు చూడబోతున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.
This post was last modified on June 11, 2024 11:32 am
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…