భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి. గత రెండు మూడు నెలలుగా సరైన స్టార్ హీరో బొమ్మ లేక ముంబై నుంచి హైదరాబాద్ దాకా థియేటర్లన్నీ ఆకలి మీదున్నాయి. నాగఅశ్విన్ దర్శత్వంలో వైజయంతి మూవీస్ ఆరు వందల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న ఈ విజువల్ వండర్ ట్రైలర్ ని ఇవాళ ఏపీ తెలంగాణలోని ఎంపిక చేసిన ప్రధాన స్క్రీన్లలో స్పెషల్ ప్రీమియర్ చేశారు. రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉన్న కంటెంట్ గా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. మూడు నిముషాలున్న వీడియోలో తన విజన్ చూపించారు నాగఅశ్విన్.
ప్రపంచపు మొదటి, చివరి ఊరిగా చెప్పుకునే కాశి నగరం మీద దుష్టశక్తుల కళ్ళు పడతాయి. లోక రక్షణ కోసం దేనికైనా తెగించే అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ఒక ప్రాణిని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు. దానికి భైరవ (ప్రభాస్) సహాయం అవసరమవుతుంది. కాలంతో పాటు ప్రయాణించే బుజ్జి వాహనాన్ని తోడుగా తీసుకుని లక్ష్యం వైపు బయలుదేరతాడు. లోక కళ్యాణం కోసం దొరక్కుండా ఉన్న అమ్మాయి (దీపికా పదుకునే)ని తీసుకొచ్చే బాధ్యత ఇతని మీద పడుతుంది. అసలు కలియుగాంతం నుంచి కల్కి అవతారం దాకా వేల సంవత్సరాల మధ్యలో అసలేం జరిగిందనేది జూన్ 27 తెరమీద చూస్తేనే కిక్కు.
విజువల్స్ చూస్తుంటే టెర్రిఫిక్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది. నాగ అశ్విన్ ఊహాలోకం ఈ కొంత నిడివికే ఇలా అనిపిస్తే రేపు స్క్రీన్ మీద రెండు ముప్పావు గంటల పాటు ఎవరికి వారు తమను తాము మర్చిపోవడం ఖాయమే. ప్రభాస్ ఇంట్రో, అమితాబ్ బచ్చన్ ఎలివేషన్ షాట్, భీకరమైన దాడులు జరిగే సన్నివేశాలు, షాకింగ్ గెటప్ లో కమల్ హాసన్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం, జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఛాయాగ్రహణం ఒకదానితో మరొకటి హాలీవుడ్ రేంజ్ లో పోటీపడ్డాయి. జూన్ 27 దాకా ఎదురు చూడటం చాలా కష్టమనిపించే రేంజ్ లో కల్కి చేసిన మాయాజాలం ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో.
This post was last modified on June 10, 2024 8:44 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……