Movie News

అవును…విజయ్ దేవరకొండ తప్పించుకున్నాడు

కొన్నిసార్లు ముందు అనుకున్న కాంబోలు సెట్ కాక ఇతర హీరోలు రీ ప్లేస్ కావడం చాలాసార్లు చూసిందే కానీ కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అవును మంచి విజయం సాధించింది. పూర్ణ ప్రధానపాత్రలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేట్రికల్ గానూ సక్సెస్ నమోదు చేసింది. ఇందులో హీరోయిన్ భర్తగా నటించిన ఆర్టిస్ట్ హర్షవర్ధన్ రాణే. తొలుత ఈ క్యారెక్టర్ కోసం రవిబాబు విజయ్ దేవరకొండను అనుకున్నాడు. ఆ మేరకు సంప్రదించాడు కానీ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సాధ్యపడలేదు. దీంతో వేరే ఛాయస్ చూసుకోవాల్సి వచ్చింది.

అవును కన్నా ముందు రవిబాబు డైరెక్షన్లో నువ్విలాలో విజయ్ దేవరకొండ క్రికెటర్ గా చిన్న క్యామియో చేశాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. ఫ్లాప్ కావడంతో జనాలు మర్చిపోయారు కానీ అందులో రౌడీ బాయ్ ఉన్న సంగతి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే గుర్తుంది. అప్పుడు ఏర్పడ్డ బాండింగ్ తోనే రవిబాబు అవును కోసం విజయ్ ని అడిగాడు. కానీ కుదరలేదు. ఇద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయనే టాక్ కూడా తిరిగింది. కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత రవిబాబు ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ కుటుంబాన్ని వేధించే వాడిగా చిన్న క్యామియో చేశాడు.

ఇదంతా రవిబాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన రష్ వచ్చే వారం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకుంటోంది. అయినా అవును తప్పడం విజయ్ దేవరకొండకు ఒక రకంగా మేలే అనుకోవాలి. ఎందుకంటే పూర్ణ వన్ విమెన్ షోగా నడిచిన ఆ సినిమా ద్వారా హర్షవర్ధన్ కు ఒరిగిందేమి లేదు. పైగా అవును 2 అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. ఇందులోనూ రౌడీ బాయ్ నటించాల్సి వచ్చేది. అయినా ఏది జరిగినా మంచికేనని పెద్దలు ఊరికే అనరుగా. అవును లాంటి మిస్ చేసుకుని అర్జున్ రెడ్డి లాంటివి అందుకోబట్టే విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో ఉన్నాడు.

This post was last modified on June 10, 2024 6:58 am

Share

Recent Posts

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

1 hour ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

2 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

2 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

3 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

4 hours ago