ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మీద సంచలన ఆరోపణలు చేసింది కథానాయిక పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ లాంటి సినిమాల్లో నటించిన ఆమె.. ఒకప్పుడు అనురాగ్ తనకు అవకాశమిస్తానని పిలిచి, ఓ గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తన సినిమాల్లో నటించిన హ్యూమా ఖురేషి, మహి గిల్ లాంటి కథానాయికలు తాను కోరింది చేశారని అనురాగ్ చెప్పాడని.. అలాగే తనను కూడా కాంప్రమైజ్ కావాలని అనురాగ్ అడిగాడని.. తాను అందుకు మానసికంగా సిద్ధంగా లేనని చెప్పి వచ్చేశానని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనురాగ్ మీద చర్యలు తీసుకోవాలని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే విజ్ఞప్తి చేసింది పాయల్. నిన్న రాత్రి నుంచి ఈ వ్యవహారం సంచలనం రేపుతున్నాయి.
ఐతే పాయల్ ఆరోపణలు బయటికి వచ్చాక కొన్ని గంటల పాటు మౌనంగా ఉన్న అనురాగ్ అర్ధరాత్రి దాటాక వాటికి బదులిచ్చాడు. హిందీ ట్వీట్లతో అతను పాయల్‌కు సమాధానం ఇచ్చాడు. ఆమె పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నో ఏళ్ల ముందు తాను అసభ్యంగా ప్రవర్తించినట్లు చెబుతున్న పాయల్.. ఇంత కాలం తర్వాత ఎందుకు స్పందిస్తోందని అనురాగ్ ప్రశ్నించాడు. పాయల్ ఆరోపణలు గుప్పించిన వీడియో చూస్తే అవి ఎంత వరకు నిజమో అర్థం చేసుకోవచ్చని అతనన్నాడు. పాయల్ తన గురించి మాట్లాడకుండా వేరే మహిళల పేర్లను ఇందులోకి తీసుకురావడాన్ని అతను తప్పుబట్టాడు. తనపై పాయల్ చేసిన ఆరోపణలు నిరాధార పూరితమైనవని అతనన్నాడు. తన మొదటి భార్య (కల్కీ కొచ్లిన్)తో అయినా.. లేదా ప్రేయసితో అయినా.. లేదా ఇంకో మహిళ ఎవరితో అయినా సరే.. తాను బయట ఎప్పుడూ అలా ప్రవర్తించనని అతనే తేల్చేశాడు. అలా ఎవరు ప్రవర్తించినా కూడా అంగీకరించనన్నాడు. పాయల్ ఇన్ని ఆరోపణలు చేసినా కూడా తాను ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నానన్న అనురాగ్.. ఆమె ఇంగ్లిష్‌లో ఆరోపణలు చేస్తే తాను హిందీలో బదులిస్తున్నందుకు సారీ చెప్పి తన వివరణను ముగించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates