రామోజీరావు అనగానే ఈనాడు ప్రస్థానమే సగటు ప్రజలకు గుర్తొస్తుంది కానీ అంతే స్థాయిలో సితార మ్యాగజైన్ గురించిన కథలు వందల వేల జ్ఞాపకాల రూపంలో సినీ ప్రియుల మనసుల్లో మెదులుతాయి. 70 దశకం చివర్లో సినిమా పత్రికలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ప్రభంజనంలా సితారని తీసుకొచ్చారు రామోజీరావు. స్టార్ల ఫోటోలు, షూటింగ్ విశేషాలు, అరుదైన ఇంటర్వ్యూలు, పాత కాలం సంగతులు, పెద్ద సైజ్ బ్లో అప్పులు, ప్రత్యేక కథనాలు, ఎవరికీ తెలియని విషయాలు ఇలా ఎన్నెన్నో శీర్షికలతో ప్రతి శుక్రవారం సినీ ప్రియులు పుస్తకాల దుకాణాల వద్ద ఎదురు చూసే స్థాయిలో సితారను పెంచారు.
రూపాయి నుంచి పది రూపాయల దాకా రెండు దశాబ్దాల ప్రస్థానంలో సితారని ఎన్ని కోట్ల మంది చదివి ఉంటారో లెక్క చెప్పడం కష్టం. తొంభై దశకం చివర్లో మొదలుపెట్టిన ఈటీవీ మరో సెన్సేషన్. శాటిలైట్ ఛానల్స్ తెలుగు నెలపై మొగ్గ తొడుగుతున్న సమయంలో కేవలం పరిమిత కాల ప్రసారాలకు పరిమితమైన ట్రెండ్ లో ఇరవై నాలుగు గంటల టెలికాస్ట్ తో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దూరదర్శన్ లో వారానికి ఒక సినిమా చూడటమే అదృష్టంగా భావించే రోజుల్లో రోజుకు రెండు ప్రసారం చేసి అద్భుత ఆణిముత్యాలను ముంగిట్లోకి తీసుకొచ్చారు. టీవీ సీరియల్స్ ది మరో గొప్ప అధ్యాయం.
అంతరంగాలు, భాగవతం లాంటి ధారావాహికలతో జనం వాటి కోసమే పనులు పూర్తి చేసుకుని ఎదురు చూసే స్థాయిలో అందించారు. రోజు ఉదయం, రాత్రి వచ్చే న్యూస్ బులెటిన్ కోసం ఇప్పటికీ ఎదురు చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. పోటీ ఛానల్స్ తాకిడి పెరిగి వైరల్ న్యూస్ తోనే గడిపేస్తున్న కాంపిటీషన్ ప్రపంచంలో ఎలాంటి వైరల్ వార్తల కోసం పాకులాడకుండా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నది ఈటీవీ మాత్రమే. సితార ఇప్పుడు లేకపోవచ్చు ఈటీవీ మాత్రం తన ప్రవాహాన్ని కొనసాగిస్తోంది. వినోద రంగంలో ఇవి చూపించిన ప్రభావం, రామోజీరావుగారి విజన్ ఎప్పటికీ మర్చిపోయేది కాదు.
This post was last modified on June 8, 2024 11:42 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…