తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ కేవలం యూట్యూబ్ లో తన సినిమాల వ్యూస్ చూసి ఛత్రపతి రీమేక్ కోసం మూడేళ్లు త్యాగం చేసిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దాని ఫలితం దెబ్బకు తిరిగి టాలీవుడ్ కు వచ్చేశాడు. ఆన్ లైన్లో ఉత్తరాది ప్రేక్షకులు చూపించే అభిమానం థియేటర్ కలెక్షన్లుగా మారదని అర్థం చేసుకుని ఇక్కడ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంల టైసన్ నాయుడు చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కొంత ఆలస్యమవుతున్నప్పటికీ స్పీడ్ పెంచి ఇంకో రెండు మూడు నెలల్లో గుమ్మడికాయ కొట్టబోతున్నారు.
తాజాగా ఓ సీరియస్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అల్లరి నరేష్ తో నాంది తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ కనకమేడలతో ప్రాజెక్టుకు రంగం సిద్ధమయ్యింది. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. నాంది తర్వాత అదే హీరోతో విజయ్ తీసిన ఉగ్రమ్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. టేకింగ్ పరంగా లోపం లేకపోయినప్పటికీ కథనంలో ఉన్న తప్పుల వల్ల ఫ్లాప్ అయ్యింది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సాయి శ్రీనివాస్ కి ఇప్పటిదాకా రాని మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నట్టు వినికిడి.
ఇవి కాకుండా కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో సాయిశ్రీనివాస్ ఆల్రెడీ ఒక ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేవలం ప్రొడక్షన్ ఖర్చే యాభై కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. కిష్కిందపురి పేరు పరిశీలనలో ఉంది. చావు కబురు చల్లగా లాంటి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ కథ మీద నమ్మకంతో కౌశిక్ కి ఈ ఛాన్స్ దక్కింది. మరో రెండు స్టోరీలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. స్టోరీ నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డు చూడకుండా సాయిశ్రీనివాస్ ఓకే చెబుతున్నాడు. 2025లో కనీసం రెండు రిలీజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే మళ్ళీ కుదురుకోవచ్చు.
This post was last modified on June 7, 2024 2:58 pm
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…