పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డెబ్యూ అకీరానందన్ దే. తల్లి రేణు దేశాయ్ తో తండ్రి విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అకీరా మాత్రం ఇద్దరి దగ్గరా సమయం గడుపుతూ ఉంటాడు. గత కొంత కాలంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏదో బయట ఈవెంట్లు, థియేటర్లలో హడావిడిగా ఫోటోలకు దొరకడం తప్ప తన లుక్స్ పూర్తిగా ఎలా ఉంటాయనే అవగాహన సామాన్య ప్రేక్షకుల్లో లేదు. పవన్ కూడా ఏనాడూ తన సినిమా వేడుకలకు అదే పనిగా తీసుకొచ్చింది లేదు. కానీ జనసేన అఖండ విజయం సాధించాక ప్లాన్ మార్చేశాడు.
అకీరాను ప్రత్యేకంగా మీడియాలో హైలైట్ అయ్యేలా తమ వెంట తీసుకెళ్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకుని పరిచయం చేయడమే కాక కాళ్లకు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేసి ఆయన బ్లెస్సింగ్స్ ని అందుకునేలా చేశాడు. దెబ్బకు ఇప్పుడు జాతీయ ఛానల్స్ లోనూ అకీరా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పేదేముంది. సరైన సమయంలో అకీరాని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్న పవన్ తెలివికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజానికి ఇదంతా సినిమాలకు సంబంధం లేని వ్యవహారమే అయినా రేపు ఎప్పుడైనా తెరంగేట్రం సిద్ధం చేసినప్పుడు ఎంత వద్దన్నా భారీ స్థాయిలో అకీరా మీదకు ఫోకస్ వచ్చేస్తుంది. ఒకవేళ నటననే కెరీర్ గా ఎంచుకుంటానంటే అభ్యంతరం చెప్పనని గతం రేణు దేశాయ్ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ఆరు అడుగులపైనే ఉన్న అకీరాని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరానందన్ సైతం పవన్ తో పాటు పిన్ని అన్నాతో కలిసి ప్రతిచోటా మొహమాటం లేకుండా కలివిడిగా తిరుగుతూ తండ్రి చెప్పింది చేస్తూ నలుగురి దృష్టిలో పడుతున్నాడు.
This post was last modified on June 6, 2024 4:38 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…