కథ నచ్చి పెర్ఫార్మన్స్ కి విపరీతమైన స్కోప్ ఉంటే తప్ప ఎంత పారితోషికం ఇచ్చినా ఒప్పుకోని సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ చేస్తోంది. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్యతో మళ్ళీ జట్టు కడుతోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్ తో రామాయణంలో బిజీ కావడంతో ఫిదా భాగమతి డేట్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అయినా సరే విజయ్ దేవరకొండతో కాంబో చేసేందుకు నిర్మాత దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్.
రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఎలాగైనా సాయిపల్లవిని ఒప్పించాలని దర్శకుడి ఆలోచనట. ఎస్విసి బ్యానర్ లో తను రెండు సినిమాలు చేసింది. ఫిదా బ్లాక్ బస్టర్ కాగా నాని ఎంసిఏ కమర్షియల్ గా మంచి విజయం నమోదు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ చేయించాలనే ఉద్దేశంతో దిల్ రాజు కథను చెప్పించారట. విని ఆశ్చర్యపోయిన సాయిపల్లవి కాల్ షీట్లు చెక్ చేసుకుని తన అంగీకారాన్ని వీలైనంత త్వరగా చెబుతానని అందట.
కాపీ రైట్స్ వివాదంలో ఉన్న రామాయణం షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిందనే నేపథ్యంలో అది నిజమో కాదో మేకర్స్ నుంచి సరైన సమాచారం రావడం లేదు. ఒకవేళ వాస్తవమైతే మాత్రం రౌడీ బాయ్ సినిమాకు కాల్ షీట్లు ఇవ్వొచ్చు. కానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు మైత్రి నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ మూవీ ఉంది . కాకపోతే ఏది ముందు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. మరి మొదటిసారి విజయ్ దేవరకొండతో జోడిగా చేయబోయే అవకాశాన్ని సాయిపల్లవి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on June 6, 2024 4:41 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…