Movie News

ఇరకాటంలో పడ్డ విక్రమ్ ప్యాన్ ఇండియా సినిమా

చియాన్ విక్రమ్ అంటే టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అపరిచితుడు పుణ్యమాని ఇక్కడా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తర్వాత వరస ఫెయిల్యూర్స్ తర్వాత మార్కెట్ తగ్గిందేమో కానీ ప్రేక్షకుల్లో తన కమిట్ మెంట్ పట్ల గౌరవం మాత్రం అలాగే ఉంది. శంకర్ ఐ ఎంత డిజాస్టర్ అయినా విక్రమ్ ప్రాణాలు పణంగా పెట్టి దానికి కష్టపడిన వైనం ఫ్యాన్స్ నే కాదు సామాన్య ఆడియన్స్ ని సైతం కదిలించింది. ఇప్పుడు అంతే స్థాయిలో ఒళ్ళు హూనం చేసుకున్న తంగలాన్ విడుదలకు సిద్ధమవుతోంది. వెనుకబడిన భావజాలాన్ని గొప్పగా ఆవిష్కరించే పా రంజిత్ దర్శకుడు.

దీనికొచ్చిన ఇరకాటం ఏంటంటే అనుకున్న దానికన్నా బడ్జెట్ బాగా చేతులు దాటిపోయింది. కంటెంట్ ఏమో షాకింగ్ గా ఉంది కానీ మాస్ వర్గాలను ఎంత మేరకు ఆకట్టుకుందోననే అనుమానం జనాల్లో లేకపోలేదు. ఈ కారణంగానే బయ్యర్లు భారీ అడ్వాన్సులు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారట. ముఖ్యంగా ఇతర బాషల నుంచి హక్కుల కోసం ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని వినికిడి. మణిరత్నం అంటి దిగ్గజం పొన్నియిన్ సెల్వన్ తీస్తే అది తమిళంలో మాత్రమే బాగా ఆడింది. తెలుగులో అతి కష్టం మీద గట్టెక్కింది. అలాంటిది తంగలాన్ లాంటి టిపికల్ మూవీకి క్రేజీ ఆఫర్లు కష్టం.

ఇంకో సమస్య విడుదల తేదీ. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ఖరారు చేసుకోలేదు. ముందు 2024 జనవరి చివరి వారం అనుకుని ఆ మేరకు పోస్టర్ కూడా వదిలారు. కానీ సాధ్యపడలేదు. తర్వాత సమ్మర్ అనుకున్నారు. తీరా చూస్తే వేసవి సీజన్ అయిపోతోంది. పోనీ దసరా లేదా దీపావళి చూద్దామంటే వరసగా విజయ్ గోట్ గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, రజినీకాంత్ వెట్టాయన్, జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వగైరాలు కాచుకుని ఉన్నాయి. డిసెంబర్ దాకా ఆగుదామంటే వడ్డీల భారం. భారీ నిర్మాణ సంస్థలే నిర్మించినప్పటికీ అనుకున్న టైంలో అన్నీ జరగకపోతే ఇబ్బంది తప్పదుగా.

This post was last modified on June 5, 2024 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

9 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago