ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ పెట్టడానికి ముందు చివరగా రిలీజైన పేరున్న తెలుగు సినిమా అంటే.. ‘పలాస 1978’యే. ఐతే మంచి సినిమాగా పేరొచ్చినప్పటికీ ఆ సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదు. దీంతో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్లో తన అసహనాన్ని చూపించేశారు. మంచి సినిమాలు తీస్తే జనాలు చూడకపోతే ఇలాంటి సినిమాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఐతే అన్ సీజన్లో రిలీజ్ కావడం, సినిమాకు సరైన ప్రమోషన్ లేకపోవడం, పేరున్న కాస్టింగ్ లేకపోవడం కూడా ‘పలాస’కు చేటు చేశాయి. ఐతే థియేటర్లలో ఈ సినిమా సరిగా ఆడకపోయినా.. ఆ తర్వాత ఓటీటీల్లో దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాను జనాలు బాగానే చూస్తున్నారు అమేజాన్ ప్రైమ్‌లో. ఇందుక్కారణం.. అందులోని నక్కిలీసు గొలుసు పాటే.
ఆ పాట సినిమాలో కంటే టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీ తెచ్చిన వ్యక్తి దుర్గారావు. గోదావరి ప్రాంతానికి చెందిన దుర్గారావు, ఆయన ఫ్యామిలీ టిక్ టాక్ ద్వారా తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఆయనకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చారు. దుర్గారావు ఒక పాటకు డ్యాన్స్ చేశాడంటే వ్యూస్ మోతెక్కిపోవాల్సిందే. సోషల్ మీడియా అంతటా ఆయన వీడియోలు పాపులర్. ‘నక్కిలీసు గొలుసు’ పాటకు కూడా దుర్గారావు వేసిన స్టెప్పులు చాలా పాపులర్ అయ్యాయి. అసలు ఆ పాట ఏంటో కూడా తెలియకుండా జనాలు దీన్ని ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆరా తీస్తే ఇది ‘పలాస’లోని పాట అని జనాలకు తెలిసింది. దుర్గారావు వల్లే ఈ పాట నెమ్మదిగా జనాల్లోకి వెళ్లింది.
‘ఢీ’ ప్రోగ్రాంలో ఈ పాటకు వేసిన డ్యాన్స్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అలాగే ‘నక్కిలీసు గొలుసు’ వీడియో సాంగ్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 12.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయన్నా అది దుర్గారావు పుణ్యమా. ఈ పాట కోసమే జనాలు పెద్ద ఎత్తున సినిమా చూస్తున్నారన్నా అందులో మేజర్ క్రెడిట్ కూడా దుర్గారావుకే చెందుతుంది.
This post was last modified on September 25, 2020 11:59 am
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…