కొన్నిసార్లు పబ్లిక్ టాక్స్, రివ్యూలు మిశ్రమంగా, నెగటివ్ గా వచ్చినా సరే కమర్షియల్ కంటెంట్ కారణంగా మాస్ సినిమాలు గట్టెక్కుతాయి. ప్రతిసారి అలా జరుగుతుందని కాదు కానీ సరైన పోటీ లేకపోవడం, బాక్సాఫీస్ గ్యాప్ లాంటి కారణాలు వాటికి దోహదం చేస్తాయి. గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఇదే కోవలోకి చేరుతుంది.
మొదటి వీకెండ్ ని చక్కగా వాడేసుకుని 80 శాతం దాకా రికవరీ సాధించినట్టు టీమ్ నుంచి అందుతున్న రిపోర్ట్. మొదటి రోజు మూడున్నర కోట్ల దాకా షేర్ రాబట్టిన విశ్వక్ సినిమా తర్వాత నెమ్మదించినా నిన్న ఆదివారం రెండు కోట్ల దాకా వెళ్లడం మంచి పరిణామమే. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి దగ్గరగా ఉంది.
ట్రేడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ ఎనిమిది కోట్లు కాగా ఇప్పటిదాకా ఆరు కోట్ల ఆరవై లక్షల దాకా షేర్ వచ్చింది. అపోజిషన్ లో ఉన్న వాటిలో భజే వాయు వేగం అనూహ్యంగా రెండో రోజు పికప్ చూపించినప్పటికీ మాస్ వర్గాలకు మాత్రం గ్యాంగ్స్ అఫ్ గోదావరినే ఛాయస్ గా నిలిచింది.
దీంతో పాటు గంగం గణేశా వీక్ గా ఉండటం కలిసి వస్తోంది. ఈ వారం కొత్త రిలీజులు రాబోతున్న నేపథ్యంలో వీలైనంత ఫస్ట్ వీక్ లాభాల్లోకి ప్రవేశించడం అవసరం. సితార సోదరి సంస్థ హారికా హాసిని నిర్మించిన గుంటూరు కారం సైతం ఇదే తరహా టాక్ తో భారీ గ్రాస్ ని అందుకోవడం గమనించాల్సిన అంశం.
ఈ లెక్కల సంగతి పక్కనపెడితే టీమ్ చెప్పినంత రేంజ్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి చరిత్ర సృష్టించే అవకాశాలు తక్కువే. ఒకవేళ అదే నిజమైతే డివైడ్ టాక్ ప్రసక్తే ఉండేది కాదు. నెలన్నర రోజుల నుంచి ఈ మాత్రం మాస్ సినిమా లేక బిసి సెంటర్ల థియేటర్లు ఆలో లక్ష్మణా అంటున్న టైంలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఊరటనిచ్చిందని చెప్పాలి.
ఒకవేళ అంచనాలు కనక పూర్తిగా అందుకుని ఉంటే రికార్డుల మోత జరిగి ఉండేది. విశ్వక్ సేన్ గత సినిమా గామి కూడా మొదటి రెండు మూడు రోజులు బాగా సందడి చేసి తర్వాత నెమ్మదించేసింది. ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఎక్కడ ఆగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2024 12:24 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…