పెళ్ళై బాబు పుట్టాక కొంత బ్రేక్ తీసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలతో జట్టు కడుతూ కొత్త ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. వచ్చే వారం జూన్ 7 విడుదల కాబోతున్న సత్యభామలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా మంచి ఇంటెన్స్ పాత్రను పోషించడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.
గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాక సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ క్రైమ్ డ్రామా కోసం కాజల్ అగర్వాల్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. బాలయ్య అతిథిగా వారం క్రితమే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అసలు పాయింటుకొద్దాం.
ఆ మధ్య చిరంజీవి ఆచార్యలో ముందు కాజల్ అగర్వాల్ ని తీసుకుని కొంత భాగం షూటింగ్ చేశాక ఆ పాత్రని పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. కథ ఫ్లోకి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ ఫీలైన మాట వాస్తవం. అది డిజాస్టర్ కావడంతో అందరూ మర్చిపోయారు. కట్ చేస్తే కాజల్ ప్యాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 వచ్చే నెల రిలీజ్ కానుంది. కమల్ హాసన్ తో మొదటిసారి జట్టు కట్టడంతో బాగా ఎగ్జై టింగ్ గా ఫీలవుతోంది. నిన్న చెన్నైలో జరిగిన గ్రాండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు శంకర్ తనకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం చెప్పాడు.
అదేంటంటే భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ ఉండదు. మూడో భాగంలో మాత్రమే తన పాత్ర, దర్శనం రెండూ ఉంటాయి. ఒకవేళ శంకర్ ముందే చెప్పకపోయి ఉంటే అభిమానులు నేరుగా తెరమీద చూసి షాక్ తినాల్సి వచ్చేది. ఆరు నెలల తర్వాత భారతీయుడు 3 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అది సంక్రాంతికి వస్తుందా లేదా వేసవికి తీసుకొస్తారా అనేది ఇంకా చెప్పలేదు. ఫలితం మీద టీమ్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ చాలా షాకింగ్ గా ఉంటుందట. ఫస్ట్ పార్ట్ లో సుకన్య తరహాలో ఊహించని స్థాయిలో శంకర్ డిజైన్ చేశారని సమాచారం. చూడాలి మరి.
This post was last modified on June 2, 2024 2:43 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…