Movie News

ముగ్గురు హీరోలు.. రక్షకులవుతారా?

కరోనా టైంలో మినహాయిస్తే టాలీవుడ్ వేసవిలో ఎప్పుడూ చూడని స్లంప్ ఈసారి చూసింది. వేసవి సినిమాల సందడి పతాక స్థాయికి చేరుకునే మే నెలలో షోలు క్యాన్సిల్ చేయడం.. అసలు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్‌లే లేకుండా శుక్రవారాలను ఖాళీగా వదిలేయడం ఈసారే చూశాం. ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని ఒక్కో వారం గడిచేకొద్దీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు దయనీయంగా మారాయి.

ఐతే రెండు వారాల ముందే ఎన్నికలు పూర్తవగా.. గత వారంతో ఐపీఎల్ కూడా అయిపోయింది. లాస్ట్ వీకెండ్లో వచ్చిన ‘లవ్ మి’తోనే బాక్సాఫీస్ కొంచెం పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌లో అనుకున్నంత కళ కనిపించలేదు. ఐతే ఇప్పుడు బాక్సాఫీస్‌ను రివైవ్ చేసే బాధ్యత ముగ్గురు యువ కథానాయకుల మీద పడింది. ఆ ముగ్గురే.. విశ్వక్సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ.

ఈ ముగ్గురు యంగ్ హీరోల కొత్త చిత్రాలు ఒకే రోజు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో విశ్వక్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని టీజర్, ట్రైలర్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ దూకుడు చూపిస్తోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సమ్మర్లో ‘టిల్లు స్క్వేర్’ తర్వాత వెలవెలబోయిన థియేటర్లను ఈ చిత్రం కళకళలాడిస్తుందనే అంచనాలున్నాయి.

ఇక కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ మూవీ ‘గం గం గణేశా’ యూత్‌కు నచ్చే ఫన్, థ్రిల్లర్ మూవీస్‌లా కనిపిస్తున్నాయి. వీటి ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి. సరైన సినిమాలు లేక గత కొన్ని వారాల్లో థియేటర్లకు రావడం మానేసిన సినీ ప్రియులకు ఈ వారం మంచి మంచి ఆప్షన్లే ఉన్నాయి. కావాల్సిందల్లా ఈ మూడు చిత్రాలకు మంచి టాక్ రావడమే. అది వస్తే మూడు చిత్రాలూ వేటికవే బాగా ఆడి టాలీవుడ్‌లో తిరిగి ఉత్సాహం తీసుకురావడం ఖాయం.

This post was last modified on May 31, 2024 10:48 am

Share
Show comments

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago