కల్కి 2898 ఏడి విడుదల నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది. ప్రమోషన్ల విషయంలో కాస్త నెమ్మదిగా ఉందని ఫీలవుతున్న అభిమానులకు రోజుకో కంటెంట్ తో విందు భోజనం అందించేందుకు వైజయంతి టీమ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా కల్కి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి యానిమేటెడ్ సిరీస్ ని ఉపయోగించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా రెండు ఎపిసోడ్లను చూపించి మిగిలిన రెండు సినిమా విడుదల తర్వాత వదిలేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవన్నీ స్ట్రీమింగ్ రూపంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా మే 31 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి.
భైరవ బుజ్జిల పరిచయం ఎలా జరిగింది, ఇద్దరు కలిసి ఊహాతీతమైన ఒక అద్భుతాన్ని సృష్టించేందుకు ఏం చేశారనేది ఇందులో చూపించారు. ప్రభాస్, కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన బుజ్జి మెషీన్ తో పాటు బ్రహ్మానందం లాంటి సర్ప్రైజ్ పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. సినిమాలో లేనిది మాత్రమే ఇందులో చూపించామని దర్శకుడు నాగ అశ్విన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే షాక్ కలిగించే విజువల్స్ ని అసలు తెరపై చూడబోతున్నామని అర్థమవుతోంది. ఇంకా కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరుల ఇంట్రోలు అభిమానులకు చూపించాల్సి ఉంది.
జూన్ 27 ఎంతో దూరంలో లేనందు వల్ల కల్కి బృందం ప్రమోషన్ స్పీడ్ పెంచబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు వివిధ నగరాల్లో చేయబోతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామా సుమారు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అంచనాలను కనక అందుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి ఖాయం. యానిమేషన్ ట్రైలర్ కే ఇంత ఎక్స్ పెక్టేషన్లు పెరుగుతున్నాయంటే ఇక అసలు ట్రైలర్ వచ్చాక ఏ స్థాయి హైప్ వస్తుందో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on May 31, 2024 12:01 am
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…