Movie News

‘మహాసముద్రం’తో మాస్టర్ ప్లాన్

బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమాలో హీరోగా చేసిన కార్తికేయ.. దాని తర్వాత ఐదోదో ఆరోదో సినిమా చేస్తున్నాడు. హీరోయిన్ పాయల్ అదే సంఖ్యలో సినిమాలు చేసింది. కానీ దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘మహాసముద్రం’ పట్టాలెక్కబోతోంది. ఇందులో ఓ కథానాయకుడిగా శర్వానంద్ నటిస్తాడని కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోగా తమిళ నటుడు సిద్దార్థ్ నటిస్తాడని వెల్లడించారు. కాబట్టి ఇది మీడియం రేంజ్ మల్టీస్టారర్ అన్నమాట. తెలుగు ప్రేక్షకులు మరిచిపోయిన సిద్ధును ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులోకి హీరోగా తీసుకోవడం విశేషమే. అతను ఈ సినిమాను ఒప్పుకోవడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే తొలి సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చినప్పటికీ.. రెండో సినిమా విషయంలో మంచి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగాడు అజయ్. అతడి కథలో మంచి దమ్ము కనిపించడంతో భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి నిర్మాత అనిల్ సుంకర ముందుకొచ్చాడు. శర్వానంద్ ఇప్పటికే ‘జేకే’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. సిద్ధు ఎలాగూ తమిళుడే ఆయె. దీంతో తమిళంలోనూ ఈ సినిమాను చక్కగా ప్రమోట్ చేసి పెద్ద రేంజిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం రెండు భాషలకూ తెలిసిన హీరోయిన్లు, విలన్లనే పెట్టబోతున్నారు. సిద్ధు తెలుగువారికి కొత్త కాదు కాబట్టి ఇక్కడా సమస్య లేదు. మల్టీస్టారర్, పైగా రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని అజయ్ చూస్తున్నాడు. మరి అతడి ప్లాన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో.. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తనపై నెలకొన్న అంచనాలను అతను ఏమాత్రం అందుకుంటాడో చూడాలి.

This post was last modified on September 19, 2020 12:41 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

2 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

3 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

3 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

6 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

7 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

7 hours ago