ఇంకో అయిదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. ఎల్లుండి నుంచి ఎగ్జిట్ పోల్స్ హడావిడి మొదలైపోతుంది. ఎవరు గెలుస్తారనే దాని మీద లెక్కలేనన్ని అంచనాలు, కోట్లాది రూపాయల బెట్టింగులు జరిగిపోతున్నాయి. ప్రత్యేకించి అందరి దృష్టి పిఠాపురం మీదే ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానం కావడంతో పాటు ఖచ్చితంగా గెలుస్తాడనే ధీమా జనసేన వర్గాలతో సమానంగా టీడీపీ శ్రేణులు కూడా వ్యక్తం చేయడంతో అభిమానులు ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 4 హంగామా ఊహించడం కష్టం.
ఇదంతా పక్కనపెడితే పవన్ ఫ్యాన్స్ తమ బండ్లకు, కార్లకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వేయిస్తున్న రేడియం స్టిక్కర్లు ఏపీ మొత్తం ట్రెండ్ గా మారిపోయాయి. వీటిని తయారు చేసే దుకాణాల దగ్గర అభిమానులు క్యూలో నిలబడి మరీ చేయించుకుంటున్నారు. నిజానికి ఇలా చేయడం మోటార్ యాక్ట్ ప్రకారం తప్పు. రవాణా అధికారులు పట్టుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా తీయించేస్తారు. ఇది తెలిసి కూడా వందలు వేలు ఖర్చు పెట్టడం విశేషం. ఈ వీడియోలు ఆన్ లైన్ చూసిన ఇతర కుర్రకారు అదే స్టయిల్ లో తమకూ కావాలంటూ షాపులకు పరుగులు పెడుతున్నారు.
ఇదంతా గమనిస్తున్న ఒక మీడియం రేంజ్ నిర్మాత వెంటనే ఎమ్మెల్యే గారి తాలూకా టైటిల్ ని రిజిస్టర్ చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం. కథ, దర్శకుడు సిద్ధంగా లేకపోయినా రేపు పవన్ గెలిచాక ఈ పేరుకి డిమాండ్ వస్తుంది కాబట్టి సినిమా తీసినా తీయకపోయినా కేవలం పేరు లక్షల్లో సొమ్ములు తెచ్చేలా ఉంది. ఇప్పటికే పలువురు షార్ట్ ఫిలిం మేకర్స్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ చేసిన పొట్టి వీడియోలు వైరలవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులో పని జరక్కపోతే పిఠాపురం పేరు వాడేసుకున్న వైనం అందులో చూపిస్తున్నారు. దగ్గరలో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on May 30, 2024 4:01 pm
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…