గత వారం పదిరోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా అన్ని మీడియాల్లోనూ బాగా హైలైట్ అయిన వార్త రణ్వీర్ సింగ్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా మూవీ రాక్షస్. ఉందని ఒకసారి ఉందని, లేదు క్యాన్సిల్ చేశారని మరోసారి ఇలా ఏవేవో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అభిమానులు ఏవి నిజమో ఏవి అబద్దమో తెలియని అయోమయంలో పడ్డారు. దానికి తోడు యూనిట్ నుంచి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని క్లారిఫికేషన్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు మరింత కన్ఫ్యూజన్ పెంచాయి. ఎట్టకేలకు అన్నింటికి చెక్ పెడుతూ టీమ్ తరఫున అఫీషియల్ నోట్ వచ్చింది.
అనుకున్నట్టే రాక్షస్ కొనసాగడం లేదు. హీరో, దర్శకుడు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి వచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా ఇకపై ఇది నిర్మాణంలోకి వెళ్లడం లేదు. రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాడిగా పేర్కొంటూ, కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా సాధ్యపడలేదని, భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రశాంత్ వర్మ నుంచి వచ్చిన స్టేట్ మెంట్ లో రణ్వీర్ ఎనర్జీ, టాలెంట్ అరుదుగా దొరికే రకమని, త్వరలో తమ కలయిక సాధ్యం కావడం కోసం ఎదురు చూస్తుంటానని ఉంది. మైత్రి తరఫున టైం వచ్చినప్పుడు అన్నీ కుదురుతాయని ముగింపు పలికింది.
మొత్తానికి హనుమాన్ తర్వాత భారీ బాలీవుడ్ డెబ్యూ అందుకోబోతున్న తరుణంలో ప్రశాంత్ వర్మకు ఇది ట్విస్టే కానీ అంత ఫీలవ్వాల్సిన పని కూడా లేదనే చెప్పాలి. ఏ షారుఖ్ ఖానో అయితే అయ్యో అనుకోవచ్చు కానీ రణ్వీర్ సింగే కాబట్టి తీవ్రంగా కోల్పోయిందేమి లేదు. జై హనుమాన్ మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో దాన్ని అందుకోవడం కోసం పెద్ద కసరత్తే చేయాలి. క్యాస్టింగ్ కుదరగానే షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోవాలి. తన సినిమాటిక్ యునివర్స్ కోసం ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ ఇకపై దాని ద్వారానే ఆసక్తికరమైన అప్డేట్స్ పంచుకుంటానని చెప్పేశాడు.
This post was last modified on May 30, 2024 2:22 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…