ఒక పెద్ద సినిమా థియేటర్లో ఆడినా ఆడకపోయినా దాన్నుంచి నిర్మాత రాబట్టుకునే ఓటిటి రెవిన్యూ అతని పెట్టుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వీటి ఒప్పందాలు ఆషామాషీగా ఉండవు. నిబంధనలు కఠినంగా ఉంటాయి. వాటిని మీరినా, పాటించకపోయినా అంతే సంగతులు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఎంత స్ట్రిక్టో అర్థం కావాలంటే రెండు ఉదాహరణలు చూడాలి. మొదటిది లాల్ సలామ్. సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో లాంటి ప్రధాన పాత్ర పోషించిన ఈ అల్ట్రా డిజాస్టర్ ఇప్పటిదాకా డిజిటల్ వెలుగు చూడలేదు. టాక్ విని దూరంగా ఉన్న అభిమానులు స్మార్ట్ స్క్రీన్ కోసం వెయిట్ చేశారు.
తీరాచూస్తే ఎదురు చూసే కొద్దీ నెలలు గడుస్తున్నా లాల్ సలామ్ ఓటిటిలో రాలేదు. కారణం ఏంటయ్యా అంటే సినిమాలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కు సంబంధించిన క్రికెట్ ఫుటేజ్ దొరక్కపోవడం వల్లేనని ఇన్ సైడ్ టాక్. దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ హార్డ్ డిస్క్ పోయిందని చెప్పడం ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. రెండోది గణపథ్. టైగర్ శ్రోఫ్, కృతి సనన్ జోడిగా అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ ఆల్ టైం ఫ్లాప్ ని నెట్ ఫ్లిక్సే కొంది. గత ఏడాది అక్టోబర్ లో రిలీజైతే ఇప్పటిదాకా ఓటిటి జాడ లేదు. ఇటీవలే ఒక శాటిలైట్ ఛానల్ లో వరల్డ్ ప్రీమియర్ వేశారు.
దీనికి కారణం కూడా నెట్ ఫ్లిక్స్ పెట్టిన టర్మ్స్ ని సదరు ప్రొడ్యూసర్లు పాటించకపోవడం వల్లేనని డిజిటల్ వర్గాల కథనం. ఇలా జరగడం వల్ల వేల కోట్లతో వ్యాపారం చేసే ఓటిటి సంస్థలకు పెద్ద డ్యామేజ్ ఉండదు కానీ ఆదాయం కోల్పోయేది మాత్రం ఖచ్చితంగా నిర్మాతే. దీనికి తోడు థియేటర్లో మిస్ చేసుకున్న మూవీ లవర్స్ కి చూసే అవకాశం దక్కదు. ఇలాంటి కారణంతో అఖిల్ ఏజెంట్ కూడా ఇప్పటిదాకా బయటికి రానేలేదు. ఆర్థిక పరమైన లీగల్ లావాదేవీలు కారణంగా చెబుతున్నారు కానీ ఎప్పటికి మోక్షం దక్కుతుందో తెలియదు. హక్కులు కొన్న సోని లివ్ మాత్రం అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది.
This post was last modified on May 29, 2024 1:03 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…