కరోనా వైరస్ భయంతో ఈసారి బిగ్‍బాస్‍కి వెళ్లడానికి చాలా మంది వెనకడుగు వేసారు. దాంతో ఈ సీజన్ కోసం ఇంతకుముందే మాట్లాడి పెట్టుకున్న వాళ్ల స్థానంలో వేరే వాళ్లను పంపించాల్సి వచ్చింది. హౌస్‍లోకి వెళ్లేముందే పదిహేను రోజుల క్వారంటైన్ కూడా కంపల్సరీ చేసారు. దీంతో వారం రోజులే హౌస్‍లో వున్న సూర్యకిరణ్ కూడా మూడు వారాలకు పైగా షో కోసం సమయం కేటాయించినట్టయింది.
ఇదిలావుంటే ఈసారి వచ్చిన వాళ్లు అంత పాపులరా కాదా అనేది అటుంచితే… వాళ్లు తీసుకున్న రిస్కుకి గాను స్టార్‍మా – ఎండెమోల్ షైన్ గ్రూప్ కంటెస్టెంట్స్ కి భారీ పారితోషికాలు ఇస్తోంది. సూర్యకిరణ్ అడిగిన మొత్తానికి అయిదింతలు కట్టి పంపించారంటే బిగ్‍బాస్ ఈసారి ఎంతగా శాటిస్‍ఫై చేస్తుందనేది అర్థం చేసుకోండిక. అటు పాపులారిటీకి పాపులారిటీ వస్తోంది. ఇటు పారితోషికం కూడా భారీగా ముడుతోంది.
సూర్యకిరణ్ లాంటి అవుట్‍డేటెడ్ డైరెక్టర్, ఇప్పటి యూత్‍కి అస్సలు పరిచయమే లేని వ్యక్తికి అంత ఇస్తే ఇక లాస్య, అభిజీత్, అవినాష్ లాంటి వాళ్లకు ఎంతెంత ఇస్తారనేది మీరే ఊహించుకోండి. ఈ షోకి వెళ్లడం కోసం జబర్దస్త్ కాంట్రాక్ట్ కాన్సిల్ చేసుకున్నందుకు గాను అవినాష్ ‘మల్లెమాల’ వాళ్లకు పది లక్షల పరిహారం చెల్లించి వచ్చాడట. బిగ్‍బాస్ నుంచి ఎంత వస్తుందంటే అతను అంత నష్టం భరించి వుంటాడంటారు?