ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరిపైనే అందరి కళ్ళు నిలుస్తున్నాయి. పోటీలో భజే వాయు వేగం, గంగం గణేశా ఉన్నప్పటికి మొదటి ఓటు విశ్వక్ సేన్ కే పడుతోంది. కావాల్సింది పాజిటివ్ టాక్ ఒక్కటే. మొన్న విడుదలైన లవ్ మీ ఇఫ్ యు డేర్, రాజు యాదవ్ నిరాశపరచడంతో థియేటర్లు మళ్ళీ బోసిపోవడం మొదలైంది. నిన్న లవ్ మీ పర్వాలేదు అనిపించినా టాక్ ఎంత మాత్రం ఆశాజనకంగా లేకపోవడం వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందుకే మే 31 బాక్సాఫీస్ కు కొత్త ఉత్సాహం తెచ్చే సినిమాగా ట్రేడ్ నమ్మకం గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీదే ఉంది.
ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. అందులో బూతు డైలాగులు ఉన్నప్పటికీ సెన్సార్ లో కొన్ని మ్యూట్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. రంగస్థలం తర్వాత అంతటి డెప్త్ ఉన్న విలేజ్ డ్రామాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి తోస్తోందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన రెండు పాటలు బాగానే రీచ్ అయ్యాయి. ఊర మాస్ రాజకీయ నాయకుడిగా విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్, గోదావరి నేపథ్యం, పల్లెటూరి రాజకీయాలు వెరసి ఇలాంటి బ్యాక్ డ్రాప్ జనవరి నుంచి చూసుకుంటే టాలీవుడ్ లో రాకపోవడం చాలా పెద్ద సానుకూలాంశం.
కంటెంట్ బాణం కనక సరిగ్గా తగిలితే వసూళ్ల గోదావరి ఖాయమని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. పోటీలో మరో రెండు సినిమాలు బాగున్నా ఓపెనింగ్స్, రెవిన్యూ పరంగా ఇబ్బంది ఉండదని, డిఫరెంట్ జానర్లు కావడంతో దేని ఆడియన్స్ దానికి విడిగా వస్తారని భావిస్తున్నారు. రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరిని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. హీరోయిన్లు నేహా శెట్టి, అంజలికి ఇది పెద్ద మూవీ కావడంతో ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రేపు బాలకృష్ణ ముఖ్య అతిథిగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరింత హైప్ పెరగడం ఖాయం.
This post was last modified on May 27, 2024 10:09 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…