మాములుగా ఒక పెద్ద స్టార్ హీరో నుంచి ఏదైనా ఆఫర్ వస్తే ఆలోచించుకునే ఆప్షన్ యువతరం దర్శకులకు ఉండదు. దొరికిందే ఛాన్సని వెంటనే ఒప్పేసుకుంటారు. కానీ సుజిత్ మాత్రం అలాంటి మొహమాటాలకు పోకపోవడం చాలా ప్లస్ అవుతోంది. గతంలో చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా కబురు వెళ్ళింది సుజిత్ కే. కొంత కాలం స్క్రిప్ట్ మీద పని చేశాక ఎందుకో ఇది తను హ్యాండిల్ చేయలేనని సున్నితంగా నో చెప్పి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత ఎన్నో పేర్ల పరిశీలన జరిగిన తర్వాత మోహన్ రాజాకి ఇచ్చారు. ఫలితం యావరేజ్ కు హిట్టుకి మధ్యలో ఆగింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి పిలుపు అందినప్పుడు సుజిత్ ముందు రీమేక్ ప్రతిపాదనే పెట్టారట. అయితే ఏదైనా మంచి కథ ఉందాని పవర్ స్టార్ స్వయంగా అడిగినప్పుడు సుజిత్ తొణక్కుండా ఓజి గురించి చెప్పడం, స్టోరీ విపరీతంగా నచ్చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయి. ముందు ఇచ్చిన రీమేక్ ప్రపోజల్ విజయ్ తేరి అనే టాక్ అంతర్గతంగా ఉంది. తర్వాత అది హరీష్ శంకర్ కు వెళ్లిందనే సంగతి తెలిసిందే. సుజిత్ రిస్క్ తీసుకుని ఓజి గురించి చెప్పడం ఈ రోజు తనను అభిమానుల్లో హాట్ టాపిక్ గా మార్చింది. ఈ ప్రాజెక్టు మీద ఉన్న క్రేజ్ మిగిలినవాటితో పోలిస్తే ఎక్కువే.
కార్తికేయ భజే వాయు వేగం ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా సుజిత్ ఇక్కడ చెప్పిన రీమేక్ కబురును పంచుకున్నాడు. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పిన సుజిత్ జూన్ నుంచి కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27 విడుదల తేదీలో మార్పు ఉండదనే సంకేతం ఇస్తున్నాడు కానీ తిరిగి పవన్ సెట్స్ పైకి అడుగుపెట్టడం మీదే రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే కిక్ ఇస్తున్న మరో శుభవార్త ఏంటంటే ఓజి ట్రైలర్ కట్ సిద్ధంగా ఉందట. కాకపోతే ఇంకొంచెం వెయిట్ చేయాల్సి రావొచ్చు. అప్పటిదాకా ఫాన్స్ పిఠాపురం గెలుపుని ఎంజాయ్ చేస్తారు.
This post was last modified on May 27, 2024 12:03 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…