నెపోటిజం మీద బాలీవుడ్ లో జరిగినంత మన పరిశ్రమలో చర్చ జరగదు. కారణం అధిక శాతం స్టార్ల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తమను తాము ఋజువు చేసుకోవడం వల్లే. నిన్న జరిగిన సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలయ్య దీని ప్రస్తావన తెచ్చారు.
తెలుగు సినిమా గొప్పదనం గురించి వివరిస్తూ వారసత్వం అంటే ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడమో ఆయన గొప్పదనం చాటింపు చేయడమో కాదని, ఆయన బాటలో నడుస్తున్నామా లేదాని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమని అన్నారు. ఆ లెగసిని కాపాడుకునేందుకు ఎంత కష్టపడాలో అన్న రీతిలో ప్రత్యేకంగా నొక్కి వక్కాణించారు.
కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషించిన సత్యభామ జూన్ 7 విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక క్వీన్ అఫ్ మాసెస్ సోలోగా చేసిన మూవీ ఇది. శశికిరణ్ తిక్కా సమర్పణ, స్క్రీన్ ప్లే అందించగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు.
బజ్ విషయంలో కొంత వెనుకబడి ఉండటంతో బాలయ్య రాక ఒక్కసారిగా టీమ్ లో ఉత్సాహం తేవడంతో పాటు ప్రేక్షకుల అటెన్షన్ ని దీని మీదకు వచ్చేలా చేసింది. ఎన్నికల ప్రచారం వల్ల నలభై యాభై రోజుల నుంచి కెమెరాకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే లోటుని, షూటింగ్స్ లేకపోతే నటులకు ఎంత వెలితిగా ఉంటుందనే అంశాన్ని గుర్తు చేశారు.
బాలయ్య వారసత్వ కామెంట్స్ ఎవరి గురించోనని ప్రత్యేకంగా శల్య పరీక్ష అక్కర్లేదు. తండ్రి ఎన్టీఆర్ గురించి చెప్పినా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఇక హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ బాలకృష్ణ దగ్గర ఎమోషన్స్ ఉంటాయి తప్ప క్యాలికులేషన్స్ ఉండవని చెప్పడం ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టించింది. దర్శకుడు సుమన్ మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పడంతో ఆడిటోరియం ఈలలతో హోరెత్తిపోయింది. శ్రీకృష్ణుడికి అండగా సత్యభామ నిలబడినట్టు మా సత్యభామకు బాలకృష్ణ అభిమానం తోడయ్యిందని చెప్పడం కొసమెరుపు.
This post was last modified on May 25, 2024 9:32 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…