ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘కల్కి’ విడుదలకు అటు ఇటుగా ఇంకో నెల రోజుల సమయమే ఉంది. షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ప్రమోషన్లు మొదలుపెట్టేసింది చిత్ర బృందం. ఇ
టీవలే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అని చెప్పుకోదగ్గ బుజ్జి అనే విచిత్ర వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక ప్రమోషనల్ ఈవెంట్ చేసింది చిత్ర బృందం. అందులో ప్రభాసే కీలకంగా వ్యవహరించాడు. కానీ ముఖ్య నటీనటుల్లో ఇంకెవరూ కనిపించలేదు.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి నటుల స్థాయి వేరు. వాళ్లవి లీడ్ రోల్స్ కూడా కావు. కాబట్టి వాళ్లు ప్రమోషన్లలో పాల్గొనకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకొనే మాత్రం ఈ ఈవెంట్లో పాల్గొనలేదు. అంతే కాక ఇప్పటిదాకా ప్రమోషన్ల పరంగా ఆమె నుంచి సౌండే లేదు.
సోషల్ మీడియాలో సైతం ‘కల్కి’ సినిమాను ఆమె ప్రమోట్ చేయట్లేదు. ఈ సినిమా మొదలైనపుడు మీడియా వాళ్లు దీన్ని ప్రభాస్ చిత్రంగా పేర్కొనడం, తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టడం గుర్తుండే ఉంటుంది.
కట్ చేస్తే ఇప్పుడు కథానాయికగా సినిమాను ఓన్ చేసుకుని ప్రమోషన్లలో పాల్గొనాల్సిన దీపిక.. ఇటు వైపు చూడట్లేదు. తను నటించే హిందీ సినిమాలను మాత్రం ముందు నుంచి బాగా ప్రమోట్ చేస్తుంది దీపికా. కానీ ఎంతో పెద్ద స్కేల్లో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమాను మాత్రం విస్మరిస్తున్న భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది.
కనీసం రిలీజ్ టైంకి అయినా ఆమె మీడియా ముందుకు వస్తుందా.. ఇంటర్వ్యూలు ఇస్తుందా అన్నది సందేహంగా ఉంది. పోనీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అయినా హాజరైతే అదే చాలు అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
This post was last modified on May 24, 2024 10:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…