ఓటీటీల్లో కొత్త సినిమాలు నేరుగా రిలీజయ్యే సంస్కృతి మొదలయ్యాక విపరీతమైన చర్చ జరిగిన సినిమాల్లో ‘నిశ్శబ్దం’ ఒకటి. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఈ చిత్రాన్ని నేరుగా డిజిటిల్ స్ట్రీమింగ్‌లోకి తెచ్చేస్తారని ఐదారు నెలలుగా చర్చ నడుస్తోంది. కానీ ఎంతకీ విషయం తేలలేదు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్ర బృందం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్‌తో డీల్ కూడా ఓకే అయింది.
ఆ తర్వాత కూడా కొన్ని రోజులు నాన్చిన చిత్ర బృందం ఎట్టకేలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే అక్టోబరు 2న ‘నిశ్శబ్దం’ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రైమ్ వాళ్లు ప్రోమోలు కూడా వదిలేశారు.
‘నిశ్శబ్దం’ సినిమాకు మూడేళ్ల కిందట సన్నాహాలు మొదలయ్యాయి. ఏడాదికి పైగా మేకింగ్ దశలో ఉందా చిత్రం. ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ సినిమా తీసిన హేమంత్ మధుకర్ దీనికి దర్శకుడు. కోన వెంకట్‌తో పాటు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా నటించడం విశేషం.
మాధవన్ ఓ విభిన్నమైన పాత్రలో నటించాడు. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఓ కీలక పాత్ర పోషించాడు. అమెరికా నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. దీని టీజర్ ఉత్కంఠభరితంగా ఉండి హాలీవుడ్ సినిమాలను తలపించింది. మాటలు రాని, వినిపించని ఓ అమ్మాయి ఓ హత్య తాలూకు గుట్టును ఎలా ఛేదించిందన్నది ఈ కథ. తెలుగులో తొలిసారి ఓటీటీల్లో రిలీజైన పెద్ద సినిమా ‘వి’ తేలిపోయిన నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ మీద చాలా ఆశలతో ఉంది టాలీవుడ్. మరి అనుష్క సినిమా అంచనాల్ని ఏమేర అందుకుంటుందో చూడాలి.
This post was last modified on September 18, 2020 4:20 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…