ఒకేవారంలో రెండుసార్లు అనిరుధ్ రవిచందర్ టాక్ అఫ్ ది మీడియాగా మారాడు. దేవర ఫియర్ సాంగ్ గురించి సినీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. మొదట విన్నప్పుడు అర్థం కాలేదని, జూనియర్ ఎన్టీఆర్ కన్నా అతనే వీడియోలో ఎక్కువ హైలైట్ అయ్యాడని ఇలా ఏవేవో కామెంట్లు వినిపించాయి. అలా చేయడం మొదటి నుంచి అలవాటే అయినా దేవర మీదున్న అంచనాల కారణంగా ప్రతిదీ భూతద్దంలో కనిపిస్తోంది. ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్న ఫియర్ సాంగ్ క్రమంగా హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల అభిమానులకు మంచి వాడకం పాటగా మారిపోయిన వైనం సోషల్ మీడియాలో నడుస్తోంది.
నిన్న భారతీయుడు నుంచి శౌర పాట రిలీజయ్యింది. విపరీతమైన వాయిద్యాల హోరు లేకుండా శంకర్ ఆలోచనలకు అనుగుణంగా దేశభక్తిని రంగరించి సేనాపతి వ్యక్తిత్వాన్ని వర్ణించే రీతిలో అనిరుధ్ కంపోజ్ చేయడం ఏఆర్ రెహమాన్ ని గుర్తు చేస్తోందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ఇలాంటి కీలకమైన డబ్బింగ్ పాటలకు రెహమాన్ వేటూరి, సీతారామశాస్త్రి లాంటి పెద్ద రచయితలతో గీతరచన చేయించేవారు. శౌరకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజతో సాహిత్యాన్ని రాయించడం చాలా పెద్ద ప్లస్ అవుతోంది. గంభీరమైన పదాలు పడ్డాయి.
ఎలా చూసుకున్నా కమల్ హాసన్ కోసం తన రెగ్యులర్ శైలిని పక్కనపెట్టి అనిరుద్ రవిచందర్ పూర్తిగా శంకర్ స్టూడెంట్ గా మారిపోయాడని అనిపిస్తోంది. జూలై 12 విడుదల కాబోతున్న భారతీయుడు 2కి ఇది మొదటి ప్రమోషన్ కావడంతో బలమైన ఎమోషన్ ఉన్న ఈ పాటని మేకర్స్ రిలీజ్ చేశారు. కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన భారతీయుడు 2కి ముందు రెహమాన్ కాకుండా అనిరుద్ ని తీసుకోవడం మీద అనుమానాలు రేగాయి కానీ చూస్తుంటే మెల్లగా వాటికి స్పష్టత వచ్చేలా ఉంది.
This post was last modified on May 23, 2024 4:29 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…