Movie News

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ షూటింగ్ కి వెళ్లడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. దీన్ని ఎలాగైనా సంక్రాంతి బరిలో దింపాలనేది నిర్మాత దిల్ రాజు ఆలోచన. ముందు శతమానం భవతి నెక్స్ట్ పేజీ అనుకున్నారు కానీ హీరో, డైరెక్టరే సరిగా లాక్ కాపోవడంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. రానా నాయుడు సీజన్ 2 కోసం ఎక్కువ రోజులు ముంబైలో గడపాల్సి వచ్చిన వెంకీ తరచు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. అయితే దానికి పెంచిన గెటప్ అనిల్ కథకు సూటవ్వదు కాబట్టి ఎదురు చూస్తున్నారు.

తాజాగా వచ్చిన ఆసక్తికర అప్డేట్ ఇందులో మంచు మనోజ్ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలిసింది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి శుభాంక్షలు చెబితే దానికి బదులుగా మనోజ్ రీ ట్వీట్ చేస్తూ త్వరలో మన కాంబినేషన్ తో దుమ్ము దులుపుదాం అంటూ బదులిచ్చాడు. హీరో డైరెక్టర్ గా అయితే ఈ కలయిక ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెంకీ మూవీలో క్యారెక్టర్ గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో మాజీ ప్రియురాలు, భార్య మధ్య జరిగే ఒక థ్రిల్లర్ టైపు యాక్షన్ డ్రామాగా అనిల్ దీన్ని వెరైటీగా రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.

బహుశా జూలై లేదా ఆగస్ట్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. లొకేషన్లతో సహా రావిపూడి ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. వేగంగా షూటింగ్ చేసేలా ప్రణాళిక ఉందట. గతంలో సరిలేరు నీకెవ్వరుని కేవలం ఆరు నెలల్లో ఫినిష్ చేసిన ట్రాక్ రికార్డు అనిల్ రావిపూడిది. మహేష్ బాబునే అంత ఫాస్ట్ గా డీల్ చేసినప్పుడు వెంకీతో ఎంత సౌకర్యంగా ఉంటుందో వేరే చెప్పాలా. కాకపోతే ఆలస్యమవుతూ ఉండటంతో అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. దీనికన్నా ముందు అనుదీప్ తో ఒక సినిమా చేయాల్సింది కానీ స్టోరీ కుదరక అది కాస్తా రవితేజకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

This post was last modified on May 21, 2024 2:58 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

14 minutes ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

2 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

2 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

5 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

5 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

5 hours ago