టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ దోబూచులాటలో వెనుకబడిపోయిన మంచు మనోజ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 2017 ఒక్కడు మిగిలాడు తర్వాత మంచు హీరో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు. ఒకటి రెండు క్యామియోలు చేసినా అవి నామమాత్రమే. వ్యక్తిగత జీవితం వల్ల కొంత బ్రేక్ తీసుకున్నప్పటికీ మౌనికతో వివాహమయ్యాక తనలో మునుపటి కళ కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇకపై స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్న మంచు మనోజ్ ని నిజానికి ఎలా వాడుకోవాలో తెలియని దర్శకులే ఎక్కువ. దానికి మిరాయ్ సమాధానమయ్యేలా ఉంది.
ఇవాళ మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మిరాయ్ టీమ్ స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసింది. బ్లాక్ స్వార్డ్ (నల్ల ఖడ్గం) గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు గతంలోనే లీక్ వచ్చింది కానీ ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పూర్తి స్థాయి విలనా కాదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ లుక్ పరంగా మనోజ్ నుంచి బెస్ట్ రాబట్టుకున్నాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. లాంచ్ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ కథలు వింటూ బాగా నిరాశ పడుతున్న టైంలో మిరాయ్ ని వినిపించాడని, అద్భుతంగా నచ్చింది కాబట్టి మనసు పెట్టి చేస్తున్నానని ఆనందంగా చెప్పుకున్నాడు.
ఇకపై సెకండ్ ఇన్నింగ్స్ ని ఇలాగే మనోజ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒకపక్క అన్నయ్య విష్ణు కన్నప్పగా భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇటు చూస్తే మిరాయ్ లాంటి గ్రాండియర్లతో మనోజ్ తిరిగి ఊపందుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వాట్ ది ఫిష్ అనే మరో సినిమా నిర్మాణంలో ఉంది కానీ దాని తాలూకు అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏది ఏమైనా మనోజ్ లాంటి ఆర్టిస్టులు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా బ్రేక్ దొరుకుతుంది. 2025 ఏప్రిల్ 18న మిరాయ్ ని పది భాషల్లో విడుదలకు రెడీ చేస్తున్నారు.
This post was last modified on May 20, 2024 3:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…