సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్ మీ ఇఫ్ యు డేర్ ఒకటే. ఒకవేళ దిల్ రాజు కాంపౌండ్ హీరో కాకుండా వేరే చిన్న నిర్మాణ సంస్థ అయ్యుంటే ఈ మాత్రం బజ్ ఉండేది కాదన్నది వాస్తవం. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. థియేటర్లన్నీ తెరిపించేలా మా సినిమా ఉంటుందని ఆశిష్ తెగ ఊరించాడు కానీ నిజానికి లవ్ మీ మీద పెద్ద బరువు ఉంది. ఆ మాట నిలబడితే సంతోషమే కానీ జానర్ పరంగా చూస్తే అన్ని వర్గాలతో యునానిమస్ గా టికెట్లు కొనిపించేలా ఉంటుందా అనేదే వేయి డాలర్ల ప్రశ్న.
ఇక సవాలని ఎందుకు అనాల్సి వస్తోందంటే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఆశించిన స్థాయిలో ఛార్ట్ బస్టర్ కాలేకపోయాయి. ఒకటి రెండు మినహాయించి మిగిలినవి అసలు మ్యూజిక్ లవర్స్ కే రిజిస్టర్ కాలేదు. ఆర్య తర్వాత ఆ ఫీలింగ్ ఈ కథ విన్నప్పుడు కలిగిందని గతంలో చెప్పిన దిల్ రాజు ఇప్పుడు ఆ స్థాయి ఎలివేషన్లు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా మెప్పిస్తుందని చెబుతున్నారు తప్పించి ష్యుర్ షాట్ అనే మాట రావడం లేదు. బహుశా ది ఫ్యామిలీ స్టార్ గురించి ఎక్కువగా చెప్పుకోవడం, దాని ఫలితం రివర్స్ లో రావడం వల్ల కావొచ్చు, ఆశిష్ మూవీకి కొంత నెమ్మదించారు.
ఆపై వారం మే 31 నాలుగు రిలీజులు ఉన్నందు వల్ల లవ్ మీకి ఫస్ట్ వీక్ ఓపెనింగ్ చాలా కీలకం. హిట్ టాక్ తో పాటు వీలైనంత రెవిన్యూని తెచ్చేసుకుని బ్రేక్ ఈవెన్ దాటేస్తే గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటివి వచ్చినా ఇబ్బందేమీ ఉండదు. దెయ్యాన్ని ప్రేమించే ఒక యువకుడి కథను దర్శకుడు అరుణ్ భీమవరపు వెరైటీగా మలిచినట్టు కనిపిస్తోంది. రిలీజ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్క్రీన్ కౌంట్ దక్కించుకోనుంది. పోటీగా కమెడియన్ గెటప్ శీను రాజు యాదవ్ తప్ప ఇంకేవి రేసులో లేవు. దానికీ టాక్ కీలకమే. లవ్ మీ కనక గెలిస్తే మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి జోష్ ఇచ్చినట్టే. చూద్దాం.
This post was last modified on May 19, 2024 12:40 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…