నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి కొంత మిశ్రమ స్పందన వచ్చిన మాట వాస్తవం. నిజానికి వాళ్ళు ఏవేవో ఊహించుకున్నారు. దీపికా పదుకునే ఇంట్రో ఉంటుందని కొందరు, లేదు ప్రభాస్ గురించి ఏదైనా స్పెషల్ కంటెంట్ వస్తుందని ఇంకొందరు గట్టి అంచనాలు పెట్టేసుకున్నారు. తీరా చూస్తే కథ ప్రకారం బుజ్జి అనే టైం ట్రావెల్ చేసే ఒక కారులో ఉండే బ్రెయినని తెలిశాక షాక్ తిన్నారు. కీర్తి సురేష్ చెప్పిన డబ్బింగ్ వెరైటీగా అనిపించగా టీమ్ దీని కోసం ఎంత కష్టపడింది వాళ్ళతోనే చెప్పించడం బాగుంది.
సరే ఫీడ్ బ్యాక్ సంగతి కాసేపు పక్కనపెడితే కల్కిలో ఈ బుజ్జి ది చాలా కీలక పాత్రని యూనిట్ టాక్. ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను వేల సంవత్సరాలు వెనక్కు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇది ఉండే ఎపిసోడ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని అంటున్నారు. ఒకరకంగా ఆదిత్య 369 మెషీన్ గుర్తొస్తున్నప్పటికీ దీని మెకానిజం, కాల ప్రయాణం చేసే విధానం ఊహలకు అందని విధంగా దర్శకుడు నాగ అశ్విన్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతర క్యారెక్టర్లు వచ్చి పోతున్నా సరే బుజ్జి మాత్రం చివరిదాకా ఉంటుందట. మరి బ్రెయిన్ కి డబ్బింగ్ పూర్తిగా కీర్తి సురేషే చెబుతుందా లేదా చూడాలి.
ఇంకో రెండు రోజుల్లో ఈ సస్పెన్స్ తీరనుంది. జూన్ 27 ఎంతో దూరంలో లేదు కాబట్టి ఎన్నికల ఫలితాలు రాగానే పబ్లిసిటీ మొదలుపెట్టబోతున్నారు. మొదటి వారం మొత్తం జనంలో ఎలక్షన్ రిజల్ట్ గురించే ఎక్కువ చర్చ ఉంటుంది కాబట్టి సినిమాలను అంతగా పట్టించుకోరు. ఇది పసిగట్టే అశ్వినీదత్ బి బృందం దానికి తగ్గ ప్రణాళికలు వేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో ఎక్కువ పాటలు ఉండవట. ఒకటే అని లీక్ ఉంది కానీ రెండు లేదా మూడు ఉండొచ్చని వినికిడి. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు కల్కి.
This post was last modified on May 19, 2024 12:37 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…