ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు – రాజమౌళి సినిమా తాలూకు లీకులతో సోషల్ మీడియా క్రమం తప్పకుండా ఊగుతూనే ఉంది. ఇటీవలే ఒకరు ఫేక్ క్యాస్టింగ్ కాల్ ని పోస్ట్ చేస్తే అది వైరలైన విధానం చూసి స్వయంగా నిర్మాణ సంస్థ అది తప్పని ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. వీలైనంత సమాచారం బయటికి రాకుండా జక్కన్న బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. విదేశీ హీరోయిన్ ని తీసుకున్న సంగతి కూడా దుర్గా ఆర్ట్స్ చెప్పింది కాదు. ఇప్పుడు ఇంకో అప్డేట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయ్యింది.
కీలకమైన ప్రతినాయక పాత్ర కోసం రాజమౌళి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ని అనుకుంటున్నట్టు తెలిసింది. సలార్ లో వరదరాజ మన్నార్ గా తన ప్రెజెన్స్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. నటుడిగా అసలు పేరు కంటే క్యారెక్టర్ గానే గుర్తుండిపోయాడు. ఇటీవలే చోటేమియా బడేమియాలో చేశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే మాత్రం పృథ్విరాజ్ డేట్లు ఇవ్వకుండా ఉంటాడా. కాకపోతే అధికారికంగా చెప్పేదాకా ఏది నిజమో ఏది కాదో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేసిన రాజమౌళి ఈ నెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 20ని అఫీషియల్ గా లాంచ్ చేయొచ్చని మహేష్ వర్గాల సమాచారం. ఈ ముహూర్తం కోసమే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మహేష్ ప్రత్యేకంగా మార్చుకున్న హెయిర్ స్టైల్ ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. మహేష్ లుక్ ఫైనల్ అయ్యాక ఇక బయటికి రావడం ఉండదని అంటున్నారు. అన్ని భాషల నుంచి ఊహించని ఆర్టిస్టులు ఇందులో పాలు పంచుకుంటారని తెలిసింది. రెండు వారాలు ఆగితే సస్పెన్స్ వీడొచ్చు.
This post was last modified on May 18, 2024 9:49 pm
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…
పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, విడుదల వ్యవహారం సంచలనం…