Movie News

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం గత ఏడాది అక్టోబర్ నుంచి వాయిదాలు పడుతూనే వస్తోంది. పోనీ ఈ వేసవిలో అయినా వస్తుందేమో అనుకుంటే షూటింగ్ బ్యాలన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఆ మధ్య వదిలిన పోస్టర్ లో 2024 రిలీజ్ అన్నారు కానీ డేట్ పెట్టలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అజిత్ విదయమయార్చి తప్పుకోవడంతో కంగువని దీపావళి బరిలో దింపడం ఖాయమట.

ఇందులో క్లైమాక్స్ ఫైట్ ని నమ్మశక్యం కాని రీతిలో షూట్ చేయబోతున్నట్టు చెన్నై టాక్. సుమారు 10 వేల జూనియర్ ఆర్టిస్టులతో కనివిని ఎరుగని రీతిలో దీని చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఇంట్రోలో కూడా నాలుగు వేలకు పైగానే ఉంటారు. కానీ అక్కడ విఎఫెక్స్ ప్రధాన భూమిక పోషించింది. కానీ కంగువ కోసం నిజంగానే అంత క్యాస్టింగ్ ని పెడుతున్నారట. సూర్య బాబీ డియోల్ మధ్య ఒళ్ళు జలదరించేలా ఉంటుందట. ఒకరకంగా చెప్పాలంటే మగధీరలో వంద మంది షేర్ ఖాన్ సైన్యంతో ఫైట్ ఎలాగైతే ల్యాండ్ మార్క్ అయ్యిందో దీన్ని అలాగే తీస్తారట.

తెలుగులో యువి సంస్థ భాగస్వామ్యంతో వస్తున్న కంగువ ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ టార్గెట్ తో బరిలో దిగుతోందని కోలీవుడ్ మీడియా ఊదరగొడుతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ ఫాంటసీ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పార్ట్ 2 ఉంటుందా లేదా అనే దాని గురించి ఇంకా స్పష్టత లేకపోయినా శివ మాత్రం మొత్తం మూడు భాగాలకు సరిపడా కంటెంట్ రాసి ఉంచాడు. మొదటి భాగం హిట్ అయినా కాకపోయినా ఒక పార్ట్ కొనసాగింపు మాత్రం ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

This post was last modified on May 18, 2024 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

2 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

2 hours ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

3 hours ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

4 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

4 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

5 hours ago