Movie News

డ్రాగన్ టైటిల్ వెనుక ఊహించని మెలిక

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్ అనుకుంటున్నట్టు వచ్చిన లీక్ ఒక్కసారిగా అభిమానుల్లో జోష్ తెచ్చింది. ఇది నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా పేరు మాత్రం తారక్ ఇమేజ్ కి తగ్గట్టు పవర్ ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ భారీ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ అయ్యిందట కానీ ఇంకా నటీనటుల ఎంపిక కొలిక్కి రాలేదని సమాచారం. సరే డ్రాగన్ వినేందుకు చెప్పుకునేందుకు బాగానే ఉంది కానీ దీని వెనుక ఊహించని ఒక మెలిక ఉంది.

కొన్ని నెలల క్రితం తెలుగు తమిళంలో డ్రాగన్ అనే బైలింగ్వల్ మూవీ మొదలయ్యింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ హీరో. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని రిపోర్ట్. ముందే టైటిల్ చెప్పేశారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసే ఉంటారు. తెలుగులో చేసుకున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ చేయకపోయినా తమిళనాడు, కేరళలో డ్రాగన్ గానే రిలీజవుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ కేవలం ఒక భాషకే దాన్ని వాడుకోలేడు. సో నిజంగా ఇదే పేరు అనుకుంటే మాత్రం ముందు అర్జెంట్ గా ఈ చిక్కును తొలగించుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దేవర పార్ట్ 1, వార్ 2 షూటింగుల్లో సమాంతరంగా పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చేయాల్సింది ప్రశాంత్ నీల్ మూవీనే. అయితే ఇది ముందు మొదలవుతుందా లేక సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం స్టార్ట్ అవుతుందా అనే కన్ఫ్యూజన్ ఇంకా తీరలేదు. పలు మీడియాల్లో రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వచ్చిన గ్యాప్ కి న్యాయం చేసేందుకు తారక్ వీలైనంత వేగంగా సినిమాలు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. అక్టోబర్ లో దేవర రిలీజయ్యాక వచ్చే ఏడాది మార్చిలోగా వార్ 2 గుమ్మడికాయ కొట్టేస్తారు. సో ప్రశాంత్ నీల్ కోసం ఎంత సమయమైనా ఇచ్చే వెసులుబాటు తారక్ కు ఉంటుంది.

This post was last modified on May 17, 2024 4:26 pm

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

30 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

5 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

9 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago