యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్ రోల్స్ ట్రై చేద్దామని నా సామిరంగాలో నటిస్తే అదేమో ఆశించిన పేరు తీసుకురాలేదు. హిట్ అయినా ఆ షేర్ నాగార్జున, అల్లరి నరేష్ పంచుకున్నారు. సోలోగా రాజ్ తరుణ్ మార్కెట్ తగ్గిపోయిన మాట వాస్తవం. చలాకీతనం, టాలెంట్ రెండూ ఉన్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా మారిపోయింది. తనవి మొత్తం మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అవి తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు. నిర్మాణంలో ఉన్నవి కాకుండా ఫస్ట్ కాపీ సిద్ధమైనవి ఇవి.
వీటిలో పురుషోత్తముడు గురించి కాస్త చెప్పాలి. ఎందుకంటే మహేష్ బాబు శ్రీమంతుడు రేంజులో దీని దర్శకుడు రామ్ భీమన ఇందులో రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ఫాదర్ సెంటిమెంట్ తో పాటు కమర్షియల్ అంశాలు దట్టించాడు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీశర్మ, బ్రహ్మానందం లాంటి పెద్ద క్యాస్టింగ్ ని తీసుకున్నారు. గోపి సుందర్ సంగీతం అందించగా స్టార్ హీరోలకే ఎక్కువ పని చేసిన పిజి విందా ఛాయాగ్రహణం సమకూర్చారు. ఇంత క్వాలిటీ సెటప్ ని పెట్టుకున్నా దీని టీజర్ వచ్చిన విషయం జనాలకు ఇంకా పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయింది. వ్యూస్ అయితే ఉన్నాయి.
ఇప్పుడు దీనికి వీలైనంత సౌండ్ పెంచడం అవసరం. రాజ్ తరుణ్ తిరిగి నిలదొక్కుకోవాలంటే పెద్ద హిట్టు కావాలి. అదేదో పురుషోత్తముడు లాంటి దాంతో ట్రై చేస్తే మెరుగైన ఫలితం దక్కే అవకాశం లేకపోలేదు. బడ్జెట్ ఎలాగూ ఖర్చు పెట్టారు. ప్రమోషన్ల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. జూన్ విడుదలకు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు ఇంకా డేట్ ని నిర్ణయించలేదు. సరే శ్రీమంతుడు టైపులో కథ పెట్టారు బాగానే ఉంది అంతే స్థాయిలో అవుట్ ఫుట్ కూడా ఉంటే సక్సెస్ రావడాన్ని కొట్టిపారేయలేం. కాకపోతే మారుతీ లాంటి బలమైన బ్యాకప్ ఉన్న భలే ఉన్నాడే ముందొస్తుందో లేక పురుషోత్తముడు వస్తాడో చూడాలి.
This post was last modified on May 17, 2024 4:22 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…