Movie News

భారతీయుడు ఈసారైనా మాట మీద ఉంటాడా

దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 కొత్త విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యిందని సమాచారం. జూలై 12 సానుకూలంగా ఉంటుందని భావిస్తుండటంతో దాన్నే ఖాయం చేయొచ్చని చెన్నై టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ లైకా నిర్మాతలు, శంకర్ పరస్పరం చర్చించుకుని అంతా క్లియర్ అనుకున్నాకే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ముందు జూన్ 13 అనుకున్నా కానీ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. ఎన్నికల వేడి పూర్తిగా తగ్గాలనేది దాని వెనుక ఉన్న మరో స్ట్రాటజీ. ఇప్పుడిక ఎలాంటి అడ్డంకులు లేనట్టే.

ఇది రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఎందుకంటే భారతీయుడు 2 రిలీజ్ అయితే కానీ శంకర్ పూర్తి స్థాయిలో గేమ్ ఛేంజర్ కోసం టైం కేటాయించలేరు. పైగా చాలా వర్క్ బ్యాలన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, తమన్ రీ రికార్డింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఎన్నో వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూట్ హైదరాబాద్ లో జరుగుతూనే ఉంది. జూలైలో దీన్నుంచి విముక్తి పొందాలనే టార్గెట్ తో చరణ్ ఎప్పుడు డేట్స్ కావాలన్నా అందుబాటులో ఉంటున్నాడు. దానికి అనుగుణంగానే చిత్రీకరణ జరుగుతోంది. అసలు సమస్య మరొకటి ఉంది.

నిర్మాత దిల్ రాజు ఇప్పటిదాకా రిలీజ్ ని ప్రకటించలేదు. భారతీయుడు 2 ఫిక్స్ అయితే తప్ప ఏం మాట్లాడలేనని శంకర్ ముందు నుంచి ఒకే మాట మీద ఉండటం వల్ల జాప్యం తప్పలేదు. అసలు గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరమే వస్తుందా లేక వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం కష్టం అనేలా ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ సహనాన్ని పీక్స్ లో పరీక్షించిన నేపథ్యంలో ముందు భారతీయుడు 2 రిలీజ్ కావాలని వాళ్ళు కోరుకోవడం న్యాయముంది. బజ్ విషయంలో కమల్ మూవీ వెనుకబడి ఉండటంతో భారీ ఎత్తున ప్రమోషన్లకు ప్లానింగ్ జరుగుతోందట.

This post was last modified on May 15, 2024 12:13 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

51 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago