ఈ మధ్య మన దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ని లక్ష్యంగా మార్చుకుంటున్నారు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా చేసుకుంటూ పోతే ఎక్కడో చోట బ్రేక్ దక్కుతుందనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. రష్మిక మందన్నకు తొలి రెండు హిందీ సినిమాలు ఫ్లాప్ అయినా యానిమల్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప బ్రాండ్ కి ఇది తోడవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. దెబ్బకు నిర్మాణంలో ఉన్న తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే పూజా హెగ్డే సైతం పట్టువదలని విక్రమార్కురాలిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. తమిళ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీన్నే హిందీలో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ గా తీస్తున్నారు. ఇది మహానటికి బాలీవుడ్ డెబ్యూ. ఇప్పుడు అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ రావొచ్చని ముంబై టాక్. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందబోయే కామెడీ హారర్ థ్రిల్లర్ కు ఈమె పేరే పరిశీలనలో ఉందట. అలియా భట్, కియారా అద్వానీలను ఆప్షన్లుగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఎవరు ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే దాన్ని బట్టి తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిసింది.
అంత ప్రత్యేకత ఏముంటుందంటే ఈ సినిమా బ్లాక్ మేజిక్ అంటే చేతబడుల మీద సీరియస్ జానర్ ని టచ్ చేస్తూనే ఎంటర్ టైన్మెంట్ తో కూడి ఉంటుందట. అక్షయ్ హీరో అయినప్పటికీ ఎక్కువ పెర్ఫార్మన్స్ ఉన్న స్కోప్ హీరోయిన్ కే ఉండటంతో ప్రియదర్శన్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఈ వెటరన్ డైరెక్టర్ తర్వాత స్పీడ్ తగ్గించారు. అక్షయ్ కాంబోలోనూ మంచి హిట్లున్నాయి. ఇప్పుడు దీన్ని కంబ్యాక్ మూవీగా మలచుకోవాలని చూస్తున్నారు. గత చిత్రాలు మరక్కార్, కరోనా పేపర్స్ థియేట్రికల్ గా నిరాశపరిచాయి.
This post was last modified on May 14, 2024 11:14 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…