ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నటిదాకా టెన్షన్ పడిన విషయం ఒకటుంది. కల్కి 2898 ఏడి నిర్మాత అశ్వినిదత్ బహిరంగంగా టిడిపి కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైసిపి కనక తిరిగి అధికారం చేజిక్కించుకుంటే జూన్ 27న టికెట్ రేట్లు, స్పెషల్ షోల విషయంలో ఇబ్బందులు ఎదురుకోక తప్పదేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. కట్ చేస్తే నిన్న పోలింగ్ శాతం చూపిస్తున్న ట్రెండ్ ప్రకారం రూలింగ్ పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు, సర్వేలు తేల్చి చెబుతున్నారు. అంటే టీడీపీ జనసేన బిజెపి పొత్తు కుర్చీ దక్కించుకోవడం ఖాయమేనని అంటున్నారు.
ఇది నిజమవుతుందో లేదో తేలడానికి ఇంకో 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ పరిణామాలన్నీ మంచి శకునాలుగా భావిస్తున్నారు కల్కి మిత్రులు. ఎందుకంటే టిడిపి వస్తే సినీ రంగానికి సంబంధించి విపరీతమైన ఆంక్షలు ఉండవు. తెలంగాణ తరహాలో పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాట్లు, అవసరమైన మేరకు రాయితీలు లభిస్తాయనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. పైగా కూటమిలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ స్వయానా సినిమా వాడే కాబట్టి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి గురించి ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది.
జూన్ 4 ఎలక్షన్ ఫలితాలు వచ్చాక రిలీజయ్యే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడినే. దేశమంతా బాక్సాఫీస్ బాగా డ్రైగా ఉన్న టైంలో ఒక్కసారిగా దానికి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చే సినిమాగా ట్రేడ్ నుంచి మూవీ లవర్స్ దాకా అందరి ఆశలు దీని మీదే ఉన్నాయి. పైగా ఓపెనింగ్స్ పరంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను సునాయాసంగా దాటేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో కల్కికి అన్నిరకాలుగా ప్రభుత్వాల నుంచి మద్దతు దక్కాలి. అశ్వినీదత్ కోరుకున్నట్టు టిడిపి జనసేన వస్తేనే ఇది సాధ్యమవుతుంది. చూడాలి ఏం జరగనుందో.
This post was last modified on May 14, 2024 3:34 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…