ఇప్పుడంటే సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయి మంచి పాత్రలు పట్టేస్తున్నారు కానీ సీనియర్ హీరోయిన్ టబు తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్లాడతా పండుగానే బాగా గుర్తుండిపోయింది. వెంకటేష్ కూలి నెంబర్ వన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిందీలో సెటిలయ్యాక ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చిరంజీవి అందరివాడు, బాలకృష్ణ పాండురంగడులో కనిపించినా అవి ఆశించిన ఫలితాలివ్వలేదు. కట్ చేస్తే సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరిగి తీసుకొచ్చారు. ఆచితూచి అడుగులు వేస్తున్న టబు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ పట్టేశారు.
ప్రపంచవ్యాప్తంగా అశేష ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్ లో త్వరలో అదే టైటిల్ కి ప్రోఫెసిని జోడించి భారీ బడ్జెట్ తో ప్రీక్వెల్ తెరక్కించబోతున్నారు. సిస్టర్ ఫ్రాన్సెస్ గా టబు చాలా కీలక పాత్ర దక్కించుకున్నారు. డ్యూన్ మొదటి భాగానికి 10 వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే పాయింట్ తో ఈ కథను రాసుకున్నారు. స్కైఫై జానర్ లో రూపొందుతున్న ఈ డ్యూన్ ప్రోఫెసికి పెట్టబోతున్న బడ్జెట్ సీక్వెల్ కంటే అయిదింతలు ఎక్కువగా ఉండబోతోందట. కాకపోతే విడుదలకు ఎంత లేదన్నా రెండు మూడేళ్లు పట్టేలా ఉంది. టబు ప్రత్యేకంగా ఎక్కువ కాల్ షీట్లు దీనికి కేటాయించాల్సి ఉంటుంది.
ఇలా బాలీవుడ్ నటీనటులు ఇంగ్లీష్ సినిమాల్లో కనిపించడం కొత్తేమి కాదు. గతంలో అమ్రిష్ పూరి, ఇర్ఫాన్ ఖాన్, అనీల్ కపూర్, ఓంపూరి తదితరులు ప్రత్యేక పాత్రల్లో తళుక్కున మెరిశారు. కాకపోతే అవి ఎంత హిట్ అయినా తిరిగి అక్కడ కొనసాగలేక తిరిగి వచ్చేశారు. ఇప్పుడు టబుకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. భూల్ భులాయ్యా 2లో డబుల్ రోల్ దెయ్యంగా ఇచ్చిన అద్భుతమైన పెర్ఫార్మన్స్ చూశాకే టబుకి ఈ ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. లేట్ వయసులో ఇంత కెరీర్ బ్రేక్ అందుకోవడం చిన్న విషయం కాదు. అందుకే అంటారు దేనికైనా రాసిపెట్టి ఉండాలని. ఈవిడకు అదే జరిగింది.
This post was last modified on May 14, 2024 10:03 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…