‘హ్యాపీడేస్’ సినిమాతో చాలామంది కొత్త నటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వాళ్లలో చాలామందికి ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకున్నది కొంతమందే. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నిఖిల్ గురించే.
‘హ్యాపీడేస్’తో నిఖిల్‌కు స్టార్ డమ్ వచ్చేయలేదు కానీ.. నటుడిగా మంచి పేరొచ్చింది, అవకాశాలూ వచ్చాయి. ఒక దశ వరకు నిఖిల్ చిన్న స్థాయిలోనే ఉన్నాడు, తడబడుతూ సాగాడు కానీ.. ‘స్వామి రారా’తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు.
ఐతే తాను ఏ స్థాయికి ఎదిగినా తొలి అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ములను మాత్రం మరిచిపోనని ఓ టీవీ ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పాడు. ఇప్పటికీ తాను ఏదైనా వస్తువు కొంటే ఇది శేఖర్ సార్ పుణ్యమే అని తలుచుకుంటానని అతను చెప్పాడు.
ఇక ‘హ్యాపీడేస్’ అనుభవం గురించి చెబుతూ.. ఆడిషన్స్‌లో లక్షకు పైగా అప్లికేషన్లు వస్తే అందులోంచి తనతో పాటు కొందరిని శేఖర్ ఎంచుకున్నాడని… కానీ తనను ఓకే చేశాక కూడా శేఖర్ ఒక కండిషన్ పెట్టి ఆందోళనకు గురి చేసినట్లు వెల్లడించాడు నిఖిల్. ఓవైపు షూటింగ్ కూడా మొదలుపెట్టేశాక, ఆడిషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని.. వాళ్లలో ఎవరైనా తన కంటే బాగా రాజేష్ పాత్ర చేస్తారు అనిపిస్తే అతణ్నే తీసుకుంటానని కమ్ముల చెప్పినట్లు నిఖిల్ తెలిపాడు.
ప్రస్తుతం ఒక పేరున్న నటుడు సైతం తన పాత్రకు పోటీకి వచ్చాడని.. కానీ చివరికి తనతోనే ఆ పాత్ర చేయించారని.. షూటింగ్ చేస్తున్నా కూడా తన స్థానంలోకి ఇంకెవరైనా వస్తారేమో అని టెన్షన్ పడుతూ గడపాల్సి వచ్చిందని.. చివరికి ఆ పాత్ర తనదే అన్నాక కానీ టెన్షన్ తీరలేదని అతను చెప్పాడు. తనను హీరోల్లో వివిధ పాత్రలకు ప్రయత్నించి చివరికి రాజేష్ పాత్రకు సరిపోతానని దానికి ఎంచుకున్నట్లు వెల్లడించాడు నిఖిల్.
This post was last modified on September 18, 2020 10:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…