ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో ఉండటం చూస్తూనే ఉన్నాం. నేనే రాజు నేనే మంత్రి ఒక్కటే సక్సెస్ కొట్టగా సీత జనాల సహనాన్ని పరీక్షించింది. దగ్గుబాటి అభిరాంని పరిచయం చేసిన అహింసని జనాలు మేము తట్టుకోలేమంటూ ఫ్లాప్ చేశారు. అయినా సరే సురేష్ బాబుకి తేజ మీద బోలెడు నమ్మకం. అందుకే రానాతో రాక్షస రాజు చేసే ఛాన్స్ ఇచ్చారు. గత ఏడాదే ఘనంగా ప్రకటించారు కానీ రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా వెళ్ళలేదు. ఇంతకీ ప్రాజెక్టు ఉంటుందా లేదా అంటే అంటే చెప్పలేమని ఇన్ సైడ్ టాక్. అనుమానం వచ్చేందుకు కారణాలున్నాయి.
కొన్నేళ్ల క్రితం వెంకటేష్ తో ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ తో ఓ సినిమాని తేజతో ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం రామానాయుడు స్టూడియోస్ లో క్యాస్టింగ్ కోసం ఆడిషన్లు జరిగాయి. తీరా కొన్ని సీన్లు తీశాక ఆపేశారు. ఆ తర్వాత గోపీచంద్ తో ఒక మూవీ ఫిక్స్ అయ్యింది. కథ కూడా సిద్ధమే. ఏమైందో కానీ పట్టాలు ఎక్కలేదు. ఇదంతా కాదని తేజ తన కొడుకునే హీరోగా పెట్టి చిత్రం 2 తీద్దామనుకున్నారు. కానీ బిజినెస్ పరంగా వర్కౌట్ కాదనే ఆలోచనతో డ్రాప్ అయ్యారు. ఇప్పుడు రాక్షస రాజు తాలూకు అప్డేట్స్ జాడే లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి.
సోలో హీరోగా రానాకు బ్రేక్ ఇచ్చిన తేజ రాక్షస రాజుని మంచి డెప్త్ తో రాసుకున్నారనే టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ రానా చూస్తేనేమో రజనీకాంత్ వెట్టయన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తప్పించి తేజకు సంబంధించిన కబుర్లు చెప్పడం లేదు. షూటింగ్ ఉన్నా లేకపోయినా క్రమం తప్పకుండా ఒక కాంబో గురించిన వార్తలు, విశేషాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయటికి వస్తుండాలి. అప్పుడే ఆడియన్స్ దాని గురించి మాట్లాడుకుంటారు. కానీ రాక్షస రాజు గురించి ఎలాంటి సౌండ్ లేకపోవడం మాత్రం వింతే. హీరోయిన్ ఎవరో కూడా తేలలేదు.
This post was last modified on May 10, 2024 5:40 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…