నిన్న హఠాత్తుగా ప్రకటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న ఈ విలేజ్ డ్రామా ముందు చెప్పినట్టు మే 17 వచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకపోయేది. ఎలాగూ జనాలు ఎన్నికల మూడ్ నుంచి బయటికి వచ్చేసి ఉంటారు కాబట్టి థియేటర్లలో పబ్లిక్ ని చూడొచ్చు. కానీ ఈ అనూహ్య నిర్ణయం వల్ల మే 31 మీద భద్రంగా కర్చీఫ్ వేసుకున్న మరో అయిదుగురు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు వీళ్ళలో ఖచ్చితంగా ఇద్దరో ముగ్గురో తప్పుకోక తప్పదేమో.
ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే సుధీర్ బాబు ‘హరోంహర’ వాటిలో మొదటిది. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి దీని సక్సెస్ చాలా కీలకం. అందుకే చిన్న అనౌన్స్ మెంట్ వీడియోకి సైతం నీళ్ల అడుగున నిలిచి వీడియో బైట్లు ఇచ్చాడు. కార్తికేయ హీరోగా యువి కాన్సెప్ట్స్ తీసిన ‘భజే వాయు వేగం’ అదే రోజు రావాలని ప్లాన్ చేసుకుంది. దానికి తగ్గట్టే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేసారు. టైటిల్, కాన్సెప్ట్ రెండూ వెరైటీగానే ఉన్నాయి.
బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆనంద్ దేవరకొండ మూవీ కావడంతో ‘గంగం గణేశా’ మీద నిర్మాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇది లేట్ అయిన ప్రాజెక్టే అయినప్పటికీ హైప్ పెంచుకునే దిశగా వెళ్తోంది. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన ‘సత్యభామ’ది ఇదే పరిస్థితి. దీని కోసమే హైదరాబాద్ వచ్చి మరీ ఇంటర్వ్యూలు గట్రా చేస్తోంది. వీటికన్నా వెనుకబడినట్టు అనిపిస్తున్నా అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరి హఠాత్ నిర్ణయం వల్ల ఎవరు తప్పుకుంటారనేది చూడాలి. ఎలాగూ మే 17 స్లాట్ ఖాళీ అయ్యింది దాన్ని వాడుకున్నా మంచి ఆలోచనే.
This post was last modified on May 10, 2024 8:20 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…