గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్ భాగస్వామిగా కొన్నేళ్ల క్రితమే మధు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి ఆ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. అయిదు వందల కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే ప్రచారం జరిగింది. కాకపోతే క్యాస్టింగ్ ఎవరనేది నిర్ణయించముందే దీన్ని ఆపేశారు. కట్ చేస్తే కొంత గ్యాప్ తర్వాత పట్టాలెక్కింది.
ఒప్పందంలో భాగంగా మధు మంతెన, అల్లు అరవింద్ లకు ప్రైమ్ ఫోకస్ నుంచి చెల్లింపులు రావాలనేది నోటీసు సారాంశం. తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు కాబట్టి ఉన్నంతలో మెయిన్ పాయింట్ అయితే ఇదే. నితీష్ తివారి లేదా వేరేవారు దర్శకత్వం వహించినా తమకున్న రైట్స్ ని ఉల్లఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు కానీ రేపో ఎల్లుండో జరుగుతుంది.
రామాయణంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించడంతో పాటు పార్ట్ నర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు. షూటింగ్ తాలూకు లీకైన పిక్స్ ఇటీవలే సోషల్ మీడియాలో హల్చల్ చేశాక నిర్మాణ సంస్థ జాగ్రత్త వహించి మళ్ళీ అవి బయటికి రాకుండా చర్యలు తీసుకుంది. సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. ఏ వివరాలు బయటికి చెప్పకుండా గుట్టుని మెయిటైన్ చేయడం వెనుక రహస్యం ఇదాని చెవులు కోరుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. చూడాలి ఈ కాంట్రావర్సి ఎక్కడి దాకా వెళ్తుందో ఏ మలుపు తిరుగుతుందో.
This post was last modified on July 7, 2025 11:22 pm
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…