Movie News

మే 9 : తిరుగులేని బ్లాక్ బస్టర్ తేదీ

సినిమాలకు సంబంధించి కొన్ని డేట్లు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడంతా అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి తేలిపోతారు. అలాంటి వాటిలో మే 9 చాలా స్పెషల్. నిజానికి కల్కి 2898 ఏడిని ఈ రోజు రిలీజ్ చేయాలని నిర్మాత అశ్వినీదత్ చాలా బలంగా సంకల్పించుకున్నారు. కానీ ఎన్నికల హడావిడితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఇష్టం లేకపోయినా వదులుకోక తప్పలేదు. ఒకవేళ సవ్యంగా అన్నీ ప్లాన్ చేసుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లు కల్కి ప్రభంజనంలో కిక్కిరిసిపోయిన జనంతో ఉండేవి.

మే 9 గురించి ముందుగా చెప్పుకోవాల్సింది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సంచలనం. 1990 ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు దీనికొచ్చిన వసూళ్ల సునామి గురించి ఇప్పటికీ వైజయంతి టీమ్ కథలుగా చెబుతుంది. కీర్తి సురేష్ లోని నటనా పటిమ ద్వారా సావిత్రిని మళ్ళీ తెరమీద బ్రతికించిన ‘మహానటి’ వచ్చింది ఈ రోజే. నాగఅశ్విన్ ప్రతిభ ఆబాలగోపాలాన్ని అలరించింది. కమల్ హాసన్ ‘భారతీయుడు’ కేవలం తమిళంలోనే కాదు తెలుగు, హిందీలోనూ రికార్డులు సాధించడానికి పునాది పడింది ఈ రోజే. ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు ‘సంతోషం’ చేకూర్చిన దినంగా ఫ్యాన్స్ గుర్తు పెట్టుకుంటారు.

చిరంజీవి మాస్ ఇమేజ్ ఇంకా పైకి తీసుకెళ్లిన మాస్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. రైతులకు మనవంతుగా ఏదైనా చేయాలనే సందేశం మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీసిన ‘మహర్షి’ ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. టాలీవుడ్ కు ఫ్యాక్షన్ విలనిజం పరిచయం ‘ప్రేమించుకుందాం రా’ తర్వాత దాని స్ఫూర్తితో ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. ఇలా ఎన్నో మరపురాని విజయాలను తెలుగు సినిమాకిచ్చిన మే 9 అంటే మూవీ లవర్స్ కే కాదు నిర్మాతలకూ ప్రత్యేక మక్కువ. ఈ తేదీకి ఫ్లాపులు లేవని కాదు కానీ తిరుగులేని సక్సెస్ రేట్ ప్రత్యేకంగా నిలిపింది.

This post was last modified on May 9, 2024 3:31 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago