లేక లేక ఎన్నో నెలల తర్వాత ఈ మధ్యే హైదరాబాద్ సిటీ దాటి బయటికెళ్లాడు అల్లు అర్జున్. కానీ అతడితో పాటే వివాదం కూడా వెంట వచ్చేసింది. కరోనా కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశం నిషిద్ధమైన ప్రాంతానికి వెళ్లి బన్నీ అండ్ కో హల్‌చల్ చేయడం చర్చనీయాంశమైంది.
నాలుగు రోజుల కిందట అక్కడి కుంటాల జలపాతాన్ని తన బృందంతో కలిసి సందర్శించడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్య జనానికి ఈ జలపాతం చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు.. అల్లు అర్జున్‌కు మాత్రం ఎలా అవకాశం ఇచ్చారని జనాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఓ ప్రభుత్వ అధికారి సైతం దీన్ని తప్పుబట్టినట్లు అప్పుడు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అంతటితో వ్యవహారం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల విరామం తర్వాత ఇప్పుడు ఈ విషయమై బన్నీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం చర్చనీయాంశమైంది.
బన్నీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని, అలాగే సమీపంలో ఉన్న తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి సంస్థ ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని ప్రకటించారు.
మరోవైపు అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించాడంటూ బన్నీ మీద ఆ జిల్లా అటవీ అధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు సదరు సంఘం ప్రతినిధులు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖ అందించి వచ్చారు.
ఐతే మహారాష్ట్ర పరిధిలోని తిప్పేశ్వర్‌లో బన్నీ మొన్న షూటింగ్ లాంటిదేమీ చేసినట్లయితే వార్తలు రాలేదు. తన కొత్త సినిమా ‘పుష్ప’ కోసం లొకేషన్లు పరిశీలించడానికే అతను ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. బహుశా కెమెరామన్‌ను వెంట తీసుకెళ్ల విజువల్స్ తీసుకోవడంతో షూటింగ్ చేశారని అనుకున్నారేమో.
This post was last modified on September 17, 2020 1:04 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…