టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద రెండు వందల కోట్లు దాటడమే గొప్ప ఘనత భావించే బాక్సాఫీస్ కు తొలిసారి వేయి కోట్ల రుచి చూపించి ఎందరో ఫిలిం మేకర్స్ కి తిరుగు లేని ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభాస్ ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ డంకి బలమైన పునాది వేసింది ఈ బ్లాక్ బస్టరే. దాని ప్రభావం వల్లే డార్లింగ్ మూవీస్ కమర్షియల్ గా ఎలాంటి ఫలితాలు అందుకుంటున్నా ప్రతి ప్రాజెక్టుకి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అంతగా బాహుబలి జనాల్లోకి చొచ్చుకుపోయిందనేది కాదనలేని వాస్తవం.
ఇప్పుడు యానిమేషన్ సిరీస్ వస్తోంది. వచ్చే వారం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన కబుర్లను పంచుకున్నారు. భవిష్యత్తులో బాహుబలిని మరింత విసృతం చేస్తామని నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా అన్నారు. అయితే నిజంగా దీని బ్రాండ్ విలువ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుందా అంటే డౌటేనంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే థియేట్రికల్ గా ఒక సినిమా ఇచ్చిన ఫీల్ ఎంత గ్రాండ్ గా ఉన్నా సరే యానిమేషన్ ఇవ్వదనేది తెలిసిందే. అలాంటప్పుడు ప్రేక్షకులు విరగబడి దాన్ని చూస్తారని అనుకోవడానికి లేదు.
పైగా ట్రైలర్ విజువల్స్ మరీ ఎక్స్ ట్రాడినరిగా అనిపించకపోవడం ఎలాంటి స్పందన తెస్తుందో చూడాలి. ఒకవేళ అసలు కంటెంట్ వచ్చాక అభిప్రాయం మారుతుందేమో. కొన్నేళ్ల క్రితం బాహుబలిని నెట్ ఫ్లిక్స్ కోసం రియల్ వెబ్ సిరీస్ గా తీయాలని ప్రయత్నించి కొంత షూటింగ్ అయ్యాక అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఆపేశారు. క్రేజ్ ఉన్నప్పుడే ఇలా జరిగితే బాహుబలి గురించి జనం దాదాపు మర్చిపోయిన టైంలో మళ్ళీ ఆ స్థాయి హైప్ తీసుకురావడం సులభం కాదు. అసలే జక్కన్న మహేష్ బాబు సినిమా కోసం ఇంకో రెండు మూడేళ్లు దొరకడం కష్టం. మరి బాహుబలి బాధ్యతను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.
This post was last modified on May 8, 2024 5:22 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…