‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా అభిమానులు. కానీ ఈ సినిమా షూటింగ్ హడావుడి అంతా ఆరంభ శూరత్వమే అయింది. కొన్ని షెడ్యూళ్లు సజావుగానే సాగినా.. మధ్యలో శంకర్ ‘ఇండియన్-2’ను పూర్తి చేసే బాధ్యతను నెత్తికెత్తుకోవడంతో ఆ ప్రభావం ‘గేమ్ చేంజర్’ మీద పడింది. ‘ఇండియన్-2’ ఒక శాపం లాగా ‘గేమ్ చేంజర్’ను వెంటాడుతూ ఈ సినిమా షూట్‌తో పాటు రిలీజ్ చాలా ఆలస్యం కావడానికి కారణమైంది.
ఐతే ఇప్పుడీ చిత్రం చివరి దశలో ఉండడం.. అక్టోబరులో రిలీజ్ ఉండొచ్చని నిర్మాత దిల్ రాజు కూడా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఊరట చెందారు. కానీ ఇంతలో మళ్లీ ‘ఇండియన్-2’ రిలీజ్ వాయిదా వార్తలు రావడంతో ‘గేమ్ చేంజర్’ మళ్లీ వెనక్కి వెళ్తుందనే ప్రచారం జరిగింది.
ఐతే ‘కల్కి’ జూన్ నెలాఖరులో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ నెల నుంచి వాయిదా పడ్డ ‘ఇండియన్-2’ కొత్త డేట్‌ను దాదాపు ఓకే చేసుకున్నట్లు సమాచారం. జులై 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని శంకర్ అండ్ కో ఫిక్సయ్యారట. కాబట్టి దీని రిలీజ్ మరీ ఆలస్యం కావట్లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ ‘గేమ్ చేంజర్’ మీద పడనట్లే. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేసి తీరాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు.
అవకాశాన్ని బట్టి అక్టోబరులో లేదంటే డిసెంబరులో సినిమాను రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. సినిమాను రెడీ చేసే విషయంలో ఇబ్బంది ఏమీ లేదని.. అక్టోబరులో సరైన రిలీజ్ డేట్ దొరకడాన్ని బట్టి విడుదల ఉంటుందని.. లేదంటే కొంత ఆలస్యం అవుతుందని.. ఈ ఏడాది ఏదో ఒక టైంలో సినిమా రిలీజ్ కావడం మాత్రం పక్కా అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్-2 రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తే ‘గేమ్ చేంజర్’ విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లే.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…