నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ప్రతినిధి-2. ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే సమయంలో అరడజనుకు పైగా చిత్రాలను లైన్లో పెట్టిన అతను కొన్నేళ్ల పాటు స్క్రీన్ మీదే కనిపించలేదు. తన కెరీర్లో మంచి హిట్‌గా నిలిచిన ప్రతినిధి సినిమాకు కొనసాగింపుగా ప్రతినిధి-2తో అతను రీఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. న్యూస్ ప్రెజెంటర్ అయిన మూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం.
రాజకీయ చిత్రం కావడం, ఎన్నికల ముంగిటే రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో దీని పట్ల ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తింది. టీజర్, ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా అనిపించాయి. కానీ ముందు ఫిబ్రవరికి అనుకుని.. ఆ తర్వాత ఏప్రిల్ 25కు వాయిదా పడ్డ ఈ చిత్రం.. ఆ డేట్‌కూ రిలీజ్ కాలేదు.
సెన్సార్, ఇంకేవో ఇబ్బందులతో సినిమాను ఏప్రిల్ 25 డేట్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ మూవీకి కొత్త డేట్ ఇచ్చారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు, అంటే మే 10న ప్రతినిధి-2ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను పరోక్షంగా ఈ సినిమాలో టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. ట్రైలర్లో కూడా ఆ సంకేతాలు కనిపించాయి. అలా అని ఇది ప్రాపగండా మూవీలా లేదు. కమర్షియల్ విలువలూ కనిపిస్తున్నాయి.
ఇలాంటి చిత్రం ఎన్నికల ముంగిట వస్తేనే ప్రయోజనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రిలీజ్ చేసి తీరాల్సిందే. కానీ సెన్సార్ అడ్డంకులన్నీ దాటుకుని.. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఈ చిత్రం మే 10న అయినా పక్కాగా థియేటర్లలోకి దిగుతుందా అన్నది సందేహం. అలా కాని పక్షంలో ఈ సినిమా తీసిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 5, 2024 11:07 am
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…