చక్కనమ్మ చిక్కినా అందమే… అంటారు కదా. ఆ మాటతో మీరు ఏకీభవించకపోతే ఒకసారి ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కొత్త లుక్ చూడండి. ఈ లాక్ డౌన్‍లో చాలా మంది తారలు సరయిన ఎక్సర్‍సైజ్ లేక లావెక్కిపోతే, అనుపమ మాత్రం చాలా కేజీల బరువు తగ్గి, నాజూగ్గా తీగలా తయారయింది.
ఇప్పటికే చాలా కాలంగా చూస్తున్నాం కనుక అనుపమ మరీ సీనియర్‍లా అనిపించవచ్చు కానీ ఆమె వయసు ఇప్పుడు ఇరవై నాలుగే. చాలా మంది హీరోయిన్లు కనీసం మొదటి సినిమా కూడా చేసి వుండని ఏజ్ ఇది. రాక్షసుడు సినిమాతో హిట్టు కొట్టిన తర్వాత అంతగా అవకాశాలు రాని అనుపమ త్వరలో దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయనుంది.
ఇంతకుముందు కనిపించిన లుక్‍కి పూర్తి భిన్నంగా ఇప్పుడీ నాజూకు రూపంతో మరోసారి కుర్రాళ్ల గుండెల్ని రంపంలా కోసేస్తుందేమో చూడాలి. అన్నట్టు ఇన్‍స్టాగ్రామ్‍లో అనుపమకు డెబ్బయ్ అయిదు లక్షల మంది ఫాలోవర్స్ వున్నారండోయ్!
This post was last modified on September 17, 2020 1:18 am
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…