Movie News

సలార్ అక్కడెందుకు ఫ్లాప్ అయ్యింది

స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ఊహించని ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవలే మొదటిసారి ప్రసారమైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు కేవలం 6.5 టిఆర్పి రేటింగ్ రావడం అభిమానులకు షాక్ ఇవ్వగా ఇండస్ట్రీ వర్గాలు నివ్వెరపోయేలా చేసింది. ఎందుకంటే ఇది చాలా తక్కువ. మిక్స్డ్ టాక్ తో ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన గుంటూరు కారం 9.2 తెచ్చుకోగా ఫ్లాప్ హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ 10కి పైగానే నమోదు చేసింది. కానీ సలార్ కు రివర్స్ జరిగింది.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు తెచ్చినా అది బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాగా యునానిమస్ గా ఫ్యామిలీ మొత్తం చూసే బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకోలేదు. పైగా డిసెంబర్ లో రిలీజైతే నాలుగు నెలల తర్వాత టీవీలో టెలికాస్ట్ చేయడం సహజంగానే ఆసక్తి తగ్గించేస్తుంది. నెట్ ఫ్లిక్స్,  ఆన్ లైన్ లో ఎప్పుడో చూసేసిన జనాలు మళ్ళీ అదే పనిగా యాడ్స్ చూస్తూ కాలక్షేపం చేయడం కష్టం. దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కెజిఎఫ్ మొదటి భాగం 11కి పైగా చాప్టర్ టూ 9కి పైగా నమోదు చేయడం గమనించాల్సిన విషయం.

సో సలార్ బుల్లితెరపై పెద్ద ఫ్లాప్ అయ్యిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. లైవ్ మ్యాచుల కోసం పబ్లిక్ ఏ స్థాయిలో సాయంత్రాలు ఖర్చు పెడుతున్నారో జియో సినిమా యాప్ లో వ్యూస్ కౌంట్ చూస్తే అర్థమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సలార్ కు వచ్చిన రెస్పాన్స్ ఒకరకంగా తీవ్రంగా నిరాశకలిగించేదే. సెకండ్ టెలికాస్ట్ లో మెరుగైన నెంబర్ వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఏమో కానీ సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే దొరికేలా ఉంది. 

This post was last modified on May 3, 2024 3:27 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago