తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్‌రావు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అంతేకాదు.. 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో బీఆర్ ఎస్‌కు కీలక సమయంలో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఈ క్రమంలో విఠల్ రావు సభ్యత్వాన్ని సైతం.. హైకోర్టు రద్దు చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
2022లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో స్థానిక సంస్థల ప్రతినిధిగా.. ఆదిలా బాద్ జిల్లా నుంచి దండే విఠల్ రావు.. బీఆర్ ఎస్ తరఫున నామినేషన్ వేశారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ మే ఉండడం గమనార్హం. ఇక, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉన్నా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. నామినేషన్ల పర్వం సాఫీగా సాగిపోయింది. ఇక, పోలింగ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోనే పెను సంచలనం చోటు చేసుకుంది.
రాజేశ్వర్ రెడ్డి తనకు అడ్డు వస్తారని.. తన గెలుపును తన్నుకు పోతారని అనుకున్నారో.. ఏమో.. దండె విఠల్ రావు.. ఇక్కడ కుట్రకు తెరలేపారని.. రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాజేశ్వర్‌రెడ్డి తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు.. ఒక దరఖాస్తును ఎన్నికల అధికారులకు పంపించారు. దీంతో ఇదినిజేనని భావించిన ఎన్నికల అధికారులు.. రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ను రద్దు చేశారు. ఈ విషయంతెలిసిన.. రాజేశ్వర్‌రెడ్డి గుండెలు బాదుకుంటూ.. హైకోర్టును ఆశ్రయించారు.
దీనిలో మోసం జరిగిందని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. ఆయన ఆరోపించారు. అయతే.. అప్పటికే ఎన్నికలు పూర్తి కావడం రాజేశ్వర్‌రెడ్డి గెలిచేయడం తెలిసిందే. ఈ కేసు విచారణ గత రెండు సంవత్సరా లుగా కొనసాగుతూనే ఉంది. ఇంతలో రాజేశ్వర్‌రెడ్డి దాఖలు చేసినట్టుగా చెబుతున్న నామినేషన్ పత్రాల పై సంతకాలను ల్యాబ్‌లో టెస్ట్(పాలీగ్రాఫీ) కు పంపించారు. మొత్తానికి ఆలస్యంగా అయినా.. శుక్రవారం హైకోర్టుకు చేరాయి. దీనిని సరిచూసుకున్న న్యాయమూర్తి.. దండె విఠల్ అనర్హుడని తేల్చేశారు.
This post was last modified on %s = human-readable time difference 4:41 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…